టీమిండియా కోచ్‌ పదవికి ప్రకటన వచ్చేసింది!

ABN , First Publish Date - 2021-10-18T08:04:58+05:30 IST

టీమిండియా తదుపరి ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్‌ ను ఒప్పించిన బీసీసీఐ.. లోధా సంస్కరణల ప్రకారం ఆ పదవితో..

టీమిండియా కోచ్‌ పదవికి ప్రకటన వచ్చేసింది!

న్యూఢిల్లీ: టీమిండియా తదుపరి ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్‌ ను ఒప్పించిన బీసీసీఐ.. లోధా సంస్కరణల ప్రకారం ఆ పదవితో పాటు మరో ముగ్గురు సహాయ సిబ్బంది భర్తీకి ఆదివారం ప్రకటన జారీ చేసింది. అలాగే నిబంధనల ప్రకారం.. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియకు క్రికెట్‌ సలహా కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రధాన కోచ్‌తోపాటు, బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లతో కలిపి మొత్తం నాలుగు పదవులకు ఎంపిక చేసిన అభ్యర్థులను బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌కు సీఏసీ సిఫారసు చేస్తుంది. 

Updated Date - 2021-10-18T08:04:58+05:30 IST