Abn logo
Sep 3 2021 @ 15:53PM

rahul gandhi : ఉద్యోగాల కల్పనలో కేంద్రం తీరు సరిగా లేదు

న్యూఢిల్లీ : ఉద్యోగాల కల్పన విషయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన విషయంలో మోదీ ప్రభుత్వం చాలా ఘోరంగా వ్యవహరిస్తోందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో, వ్యాపారాల విషయంలో మోదీ ప్రభుత్వం చాలా కటువుగా వ్యవహరిస్తోందని, కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సిందిపోయి, ఉన్న ఉద్యోగాలు ఊడేట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్వయ సమృద్ధి వైపు దేశ యువత చూస్తుంటే, దానిపై కేంద్రం నీళ్లు చల్లుతోందని ఫైర్ అయ్యారు. దేశంలో క్రోనీ క్యాపిటలిజం నడుస్తోందని, దీని వల్ల కొంత మంది వ్యాపారవేత్తలు మాత్రమే లాభాలు గడించారని రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.