Rahul gandhi : మళ్లీ రక్తం చిందింది.. దేశం తలదించుకుంది

ABN , First Publish Date - 2021-08-28T23:08:39+05:30 IST

హర్యానాలో రైతులపై జరిగిన లాఠీఛార్జీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో

Rahul gandhi : మళ్లీ రక్తం చిందింది.. దేశం తలదించుకుంది

న్యూఢిల్లీ : హర్యానాలో రైతులపై జరిగిన లాఠీఛార్జీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. హర్యానా పోలీసులు రైతుల విషయంలో మరీ క్రూరంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రైతులపై లాఠీఛార్జీ చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రైతులపై జరిగిన లాఠీఛార్జీకి సంబంధించిన ఫొటోలను రాహుల్ షేర్ చేశారు. ‘‘మళ్లీ రైతు రక్తం చిందింది. దేశం సిగ్గుతో తలదించుకుంది’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. 


భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్‌ను అడ్డుకునేందుక ప్రయత్నంచిన రైతులపై హర్యానా పోలీసులు రెచ్చిపోయారు. రైతులపై లాఠీచార్జ్ చేయడంతో ఐదుగురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు రైతులు పాక్షికంగా గాయపడ్డారు. హర్యానాలోని బస్తరలో శనివారం జరిగింది ఈ దారుణం. బీజేపీ ర్యాలీని అడ్డుకోవడానికి బయల్దేరిన రైతులను జాతీయ రహదారి 44పై ఉన్న బస్తర టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆపారు. అనంతరం రైతులపై లాఠీఛార్జ్ చేశారు.

Updated Date - 2021-08-28T23:08:39+05:30 IST