నేరుగా ధనాన్ని ఇవ్వకుండా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2020-06-06T22:54:37+05:30 IST

ప్రజలకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా ధనాన్ని అందిచడాన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ

నేరుగా ధనాన్ని ఇవ్వకుండా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ప్రజలకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా ధనాన్ని అందిచడాన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. వైరస్ ఆర్థిక వ్యవస్థపై, దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రభావం చూపుతుందని ఈ మధ్య వచ్చిన ఓ వార్తా నివేదికను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.


దేశంలోని పేద ప్రజలకు వెంటనే పదివేల చొప్పున ఆర్థిక సహాయం, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి, వాటిని ఊబిలోకి బయటకు లాగాలని ఆయన డిమాండ్ చేశారు. సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలు దేశంలోనే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వెంటనే వాటికి ఓ ప్యాకేజీ ప్రకటించాలని రాహుల్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-06-06T22:54:37+05:30 IST