కోవిడ్ మృతులకు పరిహారం ఇవ్వననడం క్రూరం: రాహుల్

ABN , First Publish Date - 2021-06-21T22:48:53+05:30 IST

కోవిడ్‌తో మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేమని కేంద్రం అనడం అత్యంత క్రూరమని..

కోవిడ్ మృతులకు పరిహారం ఇవ్వననడం క్రూరం: రాహుల్

న్యూఢిల్లీ: కోవిడ్‌తో మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేమని కేంద్రం అనడం అత్యంత క్రూరమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. జీవితం విలువ లెక్కకట్టడం అసాధ్యమని, పరిహారం అనేది చిన్న సాయమే అయినా దానికి కూడా మోదీ సర్కార్ సిద్ధంగా లేదని ఓ ట్వీట్‌లో ఆయన విమర్శించారు. కోవిడ్ సమయంలో ట్రీట్‌మెంట్ లేకపోవడం, ఆ తర్వాత తప్పుడు లెక్కలు, వీటన్నింటికీ మించి ఇప్పుడు కూర్రత్వం అగ్రస్థానంలో ఉన్నాయని అన్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్నందున కోవిడ్ మృతులు ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించడం కుదరదని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇటీవల అఫిడవిట్ సమర్పించింది. కోవిడ్‌తో మరణించిన వారు కుటుంబాలకు ప్రకృతి వైపరీత్యాల చట్టం-2005లోని సెక్షన్ 12 కింద రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారంనాడు తీర్పును రిజర్వ్ చేసింది.

Updated Date - 2021-06-21T22:48:53+05:30 IST