Abn logo
Sep 9 2021 @ 15:29PM

J&K: వైష్ణోదేవి ఆలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ

శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ గురువారం జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించుకున్నారు. మధ్యాహ్నం జమ్మూ ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన వైష్ణోదేవి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను వైష్ణోదేవికి పూజలు చేయడానికి మాత్రమే వచ్చానని, ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు.


ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ నాయకులు మినహా మిగతా నాయకుల్ని జమ్మూ కశ్మీర్‌లోకి పెద్దగా అనుమతించడం లేదు. ఈ విషయమై రాహుల్ గతంలో మోదీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు. అయితే వైష్ణోదేవి ఆలయానికి రాహుల్ పర్యటన ముందుగానే తెలిసినప్పటికీ ముందు నుంచి దోస్తీ ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేతలను కానీ ఇతర రాజకీయ నేతలను కానీ కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను వచ్చిన కారణం వేరే అని, రాజకీయాలు మాట్లాడబోనని రాహుల్ స్పష్టం చేశారు.