రాజ్యాంగాన్ని కాగితానికి పరిమితం కాకుండా చూడాలి: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-11-26T22:33:13+05:30 IST

రాజ్యాంగబద్ధమైన హక్కులు, ప్రయోజనాలు, న్యాయం దేశ ప్రజలందరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా సమానంగా అందాలని, అవి కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. పై విధంగా చెప్పుకొచ్చారు..

రాజ్యాంగాన్ని కాగితానికి పరిమితం కాకుండా చూడాలి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: రాజ్యాంగబద్ధమైన హక్కులు, ప్రయోజనాలు, న్యాయం దేశ ప్రజలందరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా సమానంగా అందాలని, అవి కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. పై విధంగా చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వ హయాంలో హక్కులు అపహస్యానికి గురవుతున్నాయని చాలా రోజులుగా విమర్శలు రాహుల్ గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజా ట్వీట్‌‌లో మోదీ ప్రభుత్వాన్ని ప్రస్తావించకుండా చట్టాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘‘న్యాయం, అధికారం అందరికీ సమాన ప్రాతిపదికన అందించాలి. ఈ రాజ్యాంగ హక్కులను కాగితాలకే పరిమితం చేయకూడదు. ఇది మన అందరికీ బాధ్యత’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నట్లు రాసుకొచ్చారు. వీటితో పాటు ‘‘రాజ్యాంగ దినోత్సవం 2021’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

Updated Date - 2021-11-26T22:33:13+05:30 IST