జర్మనీ ఎన్నికల్లో భారతీయుడి చారిత్రాత్మక విజయం!

ABN , First Publish Date - 2021-04-07T01:34:44+05:30 IST

ప్రవాస భారతీయులు వివిధ దేశాల్లో పలు రంగాల్లో సత్తాచాటుతున్న సంగతి తెలిసిందే. వీటిలో రాజకీయం కూడా ఉంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా తదితర దేశాల రాజకీయాల్లో మనోళ్లు చక్రం తిప్పుతున్నారు. ఆయా దేశాల్లోని రాజకీయాల్లో వివిధ కీలక పదవులు అధిరోహించి శభాష్ అనిపించారు. తాజాగా జర్మనీ రాజకీయాలలోనూ..

జర్మనీ ఎన్నికల్లో భారతీయుడి చారిత్రాత్మక విజయం!

బెర్లిన్: ప్రవాస భారతీయులు వివిధ దేశాల్లో పలు రంగాల్లో సత్తాచాటుతున్న సంగతి తెలిసిందే. వీటిలో రాజకీయం కూడా ఉంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా తదితర దేశాల రాజకీయాల్లో మనోళ్లు చక్రం తిప్పుతున్నారు. ఆయా దేశాల్లోని రాజకీయాల్లో వివిధ కీలక పదవులు అధిరోహించి శభాష్ అనిపించారు. తాజాగా జర్మనీ రాజకీయాలలోనూ మన భారతీయ వ్యక్తి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు. హర్యానాకు చెందిన రాహుల్ కుమార్ గత నెలలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ ఆమ్ మెయిన్‌లో నగర పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికయ్యాడు. దీంతో జర్మనీలో నగర పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన తొలి భారత వ్యక్తిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు.


కంప్యూటర్ శాస్త్రవేత్త అయిన రాహుల్ ఉన్నత విద్య కోసం జర్మనీకి వెళ్లాడు. విధ్యాబ్యాసం పూర్తైన తర్వాత బ్యాంకింగ్, ఆటోమోటివ్, వైద్యరంగాలతో పాటు వివిధ పరిశ్రమలలో కూడా పనిచేశాడు. అనంతరం రాజకీయాలోకి ప్రవేశించాడు. ఇక 2013 నుంచి రాహుల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో 2017లో ఫ్రీ డెమొక్రటిక్ పార్టీ(ఎఫ్‌డీపీ) స్థానిక ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. అనంతరం 2020లో ఫ్రీ వాహ్లెర్ పార్టీలో(ఫ్రీ ఓటర్స్ పార్టీ) చేరిన రాహుల్.. పశ్చిమా ఫ్రాంక్‌ఫర్ట్‌కు చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో రాహుల్ సుమారు 30 మంది అభ్యర్ధులపై గెలవడం విశేషం. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో అందరికీ ఉచితంగా జర్మన్ భాషను నేర్పించడం, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు వంటి హామీలను ఫ్రీ ఓటర్స్ పార్టీ ఇచ్చింది. ఇవే రాహుల్ విజయానికి పాటుపడ్డాయి. అలాగే వలసదారులకు మెరుగైన జీవన పరిస్ధితులను కల్పించడంతో పాటు గొప్ప సాంస్కృతిక వైవిధ్యం ఉన్న నగరం కోసం పాటుపడతానని రాహుల్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పడం కూడా అతడు విజయం సాధించడానికి హెల్ప్ అయిందని చెప్పాలి. 

Updated Date - 2021-04-07T01:34:44+05:30 IST