Abn logo
Aug 5 2020 @ 02:34AM

‘రాహుల్‌ మోదీ’ ర్యాంక్‌ 420

న్యూఢిల్లీ, ఆగస్టు 4 : సివిల్స్‌ ఫలితాల్లో రాహుల్‌ మోదీ అనే యువకుడు సత్తా చాటాడు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 420వ ర్యాంకు సాధించాడు. ఈనేపథ్యంలో ఆయన పేరుతో సోషల్‌మీడియాలో మంగళవారం విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. రాజకీయ ప్రత్యర్ధులు రాహుల్‌గాంధీ, నరేంద్ర మోదీల ఫొటోలను ఒక దాని పక్కన ఒకటి జతపర్చి.. ఇద్దరూ కలిసి 420 ర్యాంకు సాధించారంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. కాగా, అగ్రగామి ర్యాంకులు సాధించే వారికి ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ పోస్టులను కేటాయిస్తుంటారు. ఈ లెక్కన 420 ర్యాంకుతో రాహుల్‌మోదీకి సెంట్రల్‌ సర్వీసుల్లో అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement