కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని స్వాగతిస్తున్నాం : రాహుల్

ABN , First Publish Date - 2020-03-26T22:02:52+05:30 IST

రోనా నేపథ్యంలో కేంద్ర ప్రకటించని లక్షా 70 వేల కోట్లతో ప్రకటించిన ప్యాకేజీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని స్వాగతిస్తున్నాం : రాహుల్

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రకటించని లక్షా 70 వేల కోట్లతో ప్రకటించిన ప్యాకేజీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం స్వాగతించారు. ‘‘సరైన దిశలో తీసుకున్న మొదటి నిర్ణయం’’ అని తెలిపారు. ‘‘కరోనా నేపథ్యంలో నేడు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ సరైన దిశలో తీసుకున్న మొదటి అడుగు. ఈ లాక్‌డౌన్‌ను భరిస్తున్న రైతులు, రోజువారీ కూలీలు, రైతుల కూలీలు, మహిళలు, పెద్ద వారికి దేశం రుణపడి ఉంటుంది’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.


కరోనా కల్లోలంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు కేంద్రం ఆపన్న హస్తం అందించింది. గరీబ్ కల్యాణ్ పేరుతో రూ. లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. పేదలు రోజువారీ కూలీల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.కరోనా కల్లోలంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు కేంద్రం ఆపన్న హస్తం అందించింది. గరీబ్ కల్యాణ్ పేరుతో రూ. లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. పేదలు రోజువారీ కూలీల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Updated Date - 2020-03-26T22:02:52+05:30 IST