కేఎల్ రాహుల్‌కు శస్త్ర చికిత్స!

ABN , First Publish Date - 2021-05-04T17:02:47+05:30 IST

అపెండిసైటిస్‌తో బాధపడుతున్న టీమిండియా ఆటగాడు, పంజాబ్‌ కింగ్స్‌ జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌కు సోమవారం ఆపరేషన్ పూర్తయింది.

కేఎల్ రాహుల్‌కు శస్త్ర చికిత్స!

అపెండిసైటిస్‌తో బాధపడుతున్న టీమిండియా ఆటగాడు, పంజాబ్‌ కింగ్స్‌ జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌కు సోమవారం ఆపరేషన్ పూర్తయింది. ప్రస్తుతం రాహుల్ ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నాడు. వారం రోజుల విశ్రాంతి అనంతరం అతను మళ్లీ బరిలోకి దిగవచ్చని వైద్యులు సూచించారు. అయితే బయో బబుల్‌ వీడి బయటకు వెళ్లడంతో.. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం రాహుల్‌ మళ్లీ క్వారంటైన్‌ పూర్తి చేసుకొని పంజాబ్‌ కింగ్స్‌ జట్టుతో కలవాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-05-04T17:02:47+05:30 IST