Abn logo
Aug 15 2020 @ 04:29AM

రాయచోటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి


రాయచోటిటౌన్‌, ఆగస్టు14: రాయచోటి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటిలో నేతాజి సర్కిల్‌ వద్ద నూతన నేతాజి విగ్రహాన్ని కలెక్టర్‌ హరికిరణ్‌, ఎమ్మెల్సీ జకియాఖానంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం చెన్నముక్కపల్లె-2 గ్రామ సచివాలయం నూతన ప్రభుత్వ భవనాన్ని ప్రారంభించారు. వీరభద్రాలయం పశ్చిమ రాజగోపురం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చేపట్టే అన్ని కార్యక్రమాలకు కలెక్టర్‌ సహకరించడం సంతోషించదగ్గ విషయమన్నారు.


కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మైదుకూరు, రాయచోటి నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధులతో సచివాలయాల శాశ్వత భవనాలు వేగవంతంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చెన్నూరు అన్వర్‌బాషా, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ నేతలు దశరథరామిరెడ్డి, హబీబుల్లాఖాన్‌, ఫయాజుర్‌ రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement