Abn logo
Apr 9 2021 @ 01:39AM

మద్దిశెట్టి రవీంద్రకారుపై దాడి

పోలింగ్‌ కేంద్రం పరిశీలనకు వెళుతుండగా ఘటన 

తాళ్లూరు, ఏప్రిల్‌ 8 :శివరాంపురం పరిషత్తు ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ మండల ఇన్‌చార్జ్‌ మద్దిశెట్టి రవీంద్ర కారును వైసీపీ రెబల్‌ అభ్యర్థి మద్దతుదారులు, టీడీపీ మద్దతుదారుల అడ్డుకున్నారు. ఆయన కారుపై దాడి చేయడంతో వెనకవైపు ఉన్న అద్దం పగిలింది. పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లే మ్గాంలో బొడ్డురాయి ములుపువద్ద ్టరవీంద్ర కారును అడ్డగించారు. ‘మీరు మాగ్రామంలోని పోలింగ్‌బూత్‌కు వెళ్లవద్దు’ అని ఆపారు. అయితే రవీంద్ర తాను జడ్పీటీసీ  అభ్యర్థి మారం వెంకటరెడ్డికి చీప్‌ఏజంట్‌గా ఉన్నానని పోలింగ్‌  సరళి ఎలాఉందో తెలుసుకునేందుకు మాత్రమే వెళుతున్నానని పేర్కొన్నారు. అయినా వారు అడ్డగించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కారు అద్దాపై రాయి వేయడంతో అద్దం పగిలింది. దీంతో పోలీసులు, రవీద్ర అనుచరులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారికి సర్ధిచెప్పి సమస్య లేకుండా చేశారు. అనంతరం రవీంద్ర పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలోనే రవీంద్ర అనుచరులు పెద్ద ఎత్తునన పోలీసు స్టేషన్‌కు చేరుకొని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement