రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ

ABN , First Publish Date - 2021-03-03T07:04:12+05:30 IST

కాకినాడ స్పోర్ట్స్‌, మార్చి 2: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగిన రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో జిల్లాకు

రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ
సాయితేజశ్రీను అభినందిస్తున్న డీఎ్‌సఏ సీఈవో

కాకినాడ స్పోర్ట్స్‌, మార్చి 2: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగిన రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో జిల్లాకు చెందిన సాయితేజశ్రీ రెండు పతకాలు సాధించాడు. కాకినాడలోని జిల్లా క్రీడా మెదానంలోని రైఫిల్‌ షూటింగ్‌ అకాడమీలో సాయితేజశ్రీ కోచ్‌ మహ్మద్‌ అలీషషరీఫ్‌ (సమీర్‌) వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఈ సందర్భంగా డీఎ్‌సఏ సీఈవో భానుప్రకాష్‌, చీఫ్‌ కోచ్‌ సురే్‌షకుమార్‌ను మంగళవారం తేజశ్రీ మర్యాదపూర్వకంగా కలిశాడు. జూనియర్స్‌ విభాగంలో రజత, సీనియర్స్‌ పురుషుల విభాగంలో బంగారు పతకం సాధించడం జిల్లాకు గర్వకారణం అని భానుప్రకాష్‌ సాయితేజశ్రీ, కోచ్‌ షరీ్‌ఫను అభినందించారు. ఆఫీస్‌ అసిస్టెంట్‌ సత్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T07:04:12+05:30 IST