కలకలం రేపిన కరోనా.. రైల్వేశాఖ ప్రధాన కార్యాలయం మూసివేత..

ABN , First Publish Date - 2020-07-14T19:58:06+05:30 IST

ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యాలయం రైల్వే భవన్‌లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఇటీవల నిర్వహించిన...

కలకలం రేపిన కరోనా.. రైల్వేశాఖ ప్రధాన కార్యాలయం మూసివేత..

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యాలయం రైల్వే భవన్‌లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో పలువురు అధికారులకు కరోనా పాజటివ్ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో..  రైల్ భవన్‌ను రెండ్రోజుల పాటు మూసివేస్తున్నట్టు రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.  ‘‘ఈ నెల 9, 10, 13 తేదీల్లో నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో రైల్వే బోర్డుకు చెందిన పలువురు అధికారులకు కొవిడ్ పాజటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో 14 నుంచి 15 వరకు రెండ్రోజుల పాటు రైల్వే భవన్‌ను మూసివేసి పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాలని నిర్ణయించాం...’’ అని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ రెండు రోజులు అధికారులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తారని తెలిపింది. 

Updated Date - 2020-07-14T19:58:06+05:30 IST