రవాణా.. రెట్టింపు

ABN , First Publish Date - 2020-11-20T05:37:07+05:30 IST

వాణిజ్య ప్రాంతంగా గుంటూరు జిల్లా ఉన్నప్పటికీ ఏ కారణం చేతనో గతంలో సరుకు రవాణాని రైల్వేశాఖ ద్వారా చేసేందుకు వర్తకులు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు.

రవాణా.. రెట్టింపు
రెడ్డిపాలెం వద్ద లోడింగ్‌ చేస్తున్న దృశ్యం

 సరుకుల లోడింగ్‌ విషయంలో గుంటూరు రైల్వే డివిజన్‌ దూకుడు పెంచింది. కొత్త అవకాశాలను సృష్టించుకొని దూసుకెళుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏడు నెలల 12 రోజుల వ్యవధిలోనే గత ఏడాది కంటే రెట్టింపు సరుకులను వివిధ ప్రాంతాలకు రవాణా చేసింది. తద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే చొరవని కొనసాగించి ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి సరికొత్త రికార్డుని నెలకొల్పాల్సిందిగా జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మల్యా సూచించారు. ఆ దిశగా డివిజనల్‌ రైల్వే కమర్షియల్‌ వర్గాలు అడుగులు వేస్తున్నాయి. 


సరకు లోడింగ్‌లో రైల్వే దూకుడు

1.56 మిలియన్‌ టన్నుల తరలింపు 

కలిసొచ్చిన మిర్చి, మొక్కజొన్న ఎగుమతులు

ఇదే చొరవ చూపించాలని దక్షిణ మధ్య రైౖల్వే జీఎం సూచన


 గుంటూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య ప్రాంతంగా గుంటూరు జిల్లా ఉన్నప్పటికీ ఏ కారణం చేతనో గతంలో సరుకు రవాణాని రైల్వేశాఖ ద్వారా చేసేందుకు వర్తకులు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. కేవలం చేపల బాక్సులు మాత్రమే ఎగుమతి జరిగేవి. దానివలన  స్వల్పంగా ఆదాయం వచ్చేది. ఒకానొక సందర్భంలో ఏడాది మొత్తం మీద కూడా ఒక్క గూడ్స్‌రేక్‌ కూడా లోడింగ్‌ చేయలేకపోవడంతో రెడ్డిపా లెంలో ఉన్న గూడ్స్‌షెడ్డుని మూసేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రోడ్డు రవాణాకు ఆటంకాలు తలెత్తడంతో మిర్చి, మొక్కజొన్న తదితర సరుకుల ఎగుమతిదారులు రైల్వేని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అందివచ్చిన అ వకాశాన్ని సద్వినియోగం చేసుకొంది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం సరుకులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చి వ్యాపారుల ఆదరాభిమానాలు పొందుతోంది. పైగా రోడ్డు రవాణాతో పోల్చితే గూడ్స్‌ ద్వారా సరుకుల రవాణా ఖర్చు చాలా తక్కువ కావడంతో వ్యాపారస్థులు రైల్వే వైపునకే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది మిర్చి సీజన్‌ ఇప్పుడే ప్రారంభం కావడంతో రాబోయే మే నెల వరకు మంచి డిమాండ్‌ వచ్చే అవకాశం లేకపోలేదు. 


102 శాతం అధికంగా..

గత ఆర్థిక సంవత్సరంలో నవంబరు 12వ తేదీ నాటికి 0.77 మిలియన్‌ టన్నుల సరుకులను లోడింగ్‌ చేయగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.56 మిలియన్‌ టన్నుల సరుకు లోడింగ్‌ నమోదైంది. క్రితం సంవత్సరంతో పోల్చితే ఇది 102 శాతం అధికం. అంతేకాకుండా గత ఏడాది అంతా కలిపినా 1.551 మిలియన్‌ టన్నులే కాగా కేవలం ఏడు నెలల్లోనే దానిని అధిగమించేసింది. ఇందుకు ప్రధాన కారణం సరుకు రవాణా చేసే వారికి రైల్వే శాఖ పలురకాల మినహాయింపులు, రాయితీలను ప్రకటించింది. సరుకు లోడింగ్‌ని పెంచేందుకు రైల్వే బోర్డు బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్లను ఏర్పాటు చేసింది. దీని వలన పలు రకాల కొత్త ఉత్పత్తులను ఆకర్షించడం, ప్రస్తుతం ఉ న్న సరుకు లోడింగ్‌ని మరింతగా పెంచడంపై దృష్టి సా రించారు. ఎఫ్‌సీఐ బియ్యాన్ని తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు రవాణా చేశారు. అలానే 0.398 మిలియన్‌ టన్నుల క్లింకర్‌ లోడింగ్‌, 0.117 మిలియన్‌ టన్నుల కంటైనర్‌ రవాణా లోడింగ్‌ నమోదైంది. 


బంగ్లాదేశ్‌కు ఎండు మిర్చి..

డివిజన్‌ నుంచి బంగ్లాదేశ్‌కి నూతనంగా ఎండు మిర్చి ఎగుమతి ప్రారంభించారు. రైల్వేకు చెందిన అంతర్జాతీయ సమయసారణి ప్రకారం రెడ్డిపాలెం నుంచి బంగ్లాదేశ్‌కి పార్శిల్‌ ఎక్స్‌ప్రెస్‌ని నడిపారు. ఇప్పటివరకు ఎండుమిర్చితో కూడిన 12 సరుకు రవాణా  రైళ్లు, 11 పార్శిల్‌ రైళ్లని నడిపారు. డివిజన్‌ పరిధిలోని నాగిరెడ్డిపల్లి స్టేషన్‌ నుంచి సరికొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ప్రైవేటు సరుకు రవాణా టెర్మినల్‌ ప్రా రంభించారు. ఈ టెర్మి నల్‌ ద్వారా 51 రైళ్లలో ఆహార ధా న్యాలను లో డింగ్‌ చేశారు. నంద్యాల, న డికుడి, రెడ్డిపాలెం నుంచి 12 రైళ్లలో మొ క్కజొన్న లోడింగ్‌ చేశారు. ఇవన్నీ సరుకు లో డింగ్‌ వృద్ధికి కలిసొచ్చా యి. 

Updated Date - 2020-11-20T05:37:07+05:30 IST