రైతులకు కిసాన్‌ రైల్‌ సేవలు

ABN , First Publish Date - 2020-12-05T05:47:05+05:30 IST

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రైల్వేశాఖ కిసాన్‌ రైల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని గుంటూరు సీనియర్‌ డీసీఎం డి.నరేంద్రవర్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

రైతులకు కిసాన్‌ రైల్‌ సేవలు

 సీనియర్‌ డీసీఎం నరేంద్రవర్మ


గుంటూరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రైల్వేశాఖ కిసాన్‌ రైల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని గుంటూరు సీనియర్‌ డీసీఎం డి.నరేంద్రవర్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  రైతులు గుంటూరు డివిజన్‌ నుంచి  దేశంలో రైల్‌ కనెక్టివిటీ ఉన్న ఏ ప్రాంతానికి అయినా తమ పంట ఉత్పత్తులను రవాణ చేసుకోవచ్చన్నారు. జిల్లాలో ఎక్కువగా పండ్లు, కూరగాయలను రైతులు పండిస్తున్న దృష్ట్యా కిసాన్‌ రైల్‌ సేవలను వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. 

Updated Date - 2020-12-05T05:47:05+05:30 IST