రైలు పట్టాలు ఇలా విచిత్రంగా ఉండటాన్ని ఎప్పుడైనా చూశారా? డైమండ్ క్రాసింగ్‌లో రైళ్లు ఎలా వెళతాయో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-09T17:36:30+05:30 IST

మీరు పలుచోట్ల రైల్వే క్రాసింగ్‌లను చూసే ఉంటారు.

రైలు పట్టాలు ఇలా విచిత్రంగా ఉండటాన్ని ఎప్పుడైనా చూశారా? డైమండ్ క్రాసింగ్‌లో రైళ్లు ఎలా వెళతాయో తెలిస్తే..

మీరు పలుచోట్ల రైల్వే క్రాసింగ్‌లను చూసే ఉంటారు. అయితే అత్యంత విచిత్రంగా ఉండే డైమండ్ క్రాసింగ్‌ను మీరు ఎప్పుడైనా చూశారా? ఇది చాలా ప్రత్యేకమైన క్రాసింగ్. మన దేశంలో ఒక్క చోటమాత్రమే ఈ డైమండ్ క్రాసింగ్ ఉందని చెబుతుంటారు.  మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాత్రమే కనిపించే ఈ రైల్వే డైమండ్ క్రాసింగ్‌లో రైళ్లు ఎలా వెళతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డైమండ్ క్రాసింగ్‌లో రైళ్లు అన్ని వైపుల నుంచి వెళతాయి. ఇది చాలా అరుదైన క్రాసింగ్‌గా పరిగణిస్తారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా క్రాసింగ్‌లను చూసేవుంటాం. ఈ రైల్వే క్రాసింగ్‌లు రైలు వెళ్లే రూట్‌ను బట్టి అమర్చబడి ఉంటాయి. 


రైల్వే ట్రాక్‌లలో ఉండే ప్రత్యేక రకమైన క్రాసింగ్‌ను డైమండ్ క్రాసింగ్ అని అంటారు. చాలా తక్కువ సందర్భాల్లోనే దీని అవసరం ఉంటుంది. భారతదేశంలోని రైల్వే నెట్‌వర్క్‌లో ఒకటి, రెండు ప్రదేశాలలో మాత్రమే ఈ క్రాసింగ్ ఉందని చెబుతారు. డైమండ్ క్రాసింగ్ అనేది రైల్‌రోడ్ ట్రాక్‌ల నెట్‌వర్క్‌లోని ఒక పాయింట్, ఇక్కడ రైల్‌రోడ్ ట్రాక్‌లు నాలుగు దిశల నుంచి వెళతాయి. ఇది రోడ్డు కూడలిలా కనిపిస్తుంది. నాలుగు రైల్వే ట్రాక్‌లు ఉంటాయి. ఇది చూడటానికి వజ్రంలా కనిపిస్తుంది. అందుకే దానిని డైమండ్ క్రాసింగ్ అంటారు. భారతదేశంలోని ఏకైక డైమండ్ రైల్వే క్రాసింగ్ నాగ్‌పూర్‌లో ఉందని చెబుతారు. అయితే ఇక్కడ మూడు ట్రాక్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివిధ రిపోర్టులు చెబుతున్నాయి. 

Updated Date - 2022-01-09T17:36:30+05:30 IST