రైల్వే ఉద్యోగులకు కొవిడ్-19 టీకాలు

ABN , First Publish Date - 2021-04-12T12:41:01+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే ఉద్యోగులు కొవిడ్-19 టీకాలు వేయించుకుంటున్నారు....

రైల్వే ఉద్యోగులకు కొవిడ్-19 టీకాలు

ఇండోర్ (మధ్యప్రదేశ్): కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే ఉద్యోగులు కొవిడ్-19 టీకాలు వేయించుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో పలువురు రైల్వే ఉద్యోగులు, కార్మికులు కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నారు. 3వేల మంది రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు కరోనా వ్యాక్సిన్లు వేయిస్తున్నామని రైల్వే అధికారి జితేంద్ర కుమార్ జయంత్ చెప్పారు.రైల్వే ఉద్యోగులు ఫ్రంట్ లైన్ వర్కర్లని, వీరిలో పలువురు కరోనా బారిన పడ్డారు. రైల్వే ఉద్యోగులకు కరోనా సోకుతున్న దృష్ట్యా వారికి వ్యాక్సిన్లు వేస్తున్నామని అధికారులు చెప్పారు.ఇండోర్ నగరంలో గత 24 గంటల్లోనే 923 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో టీకా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. 

Updated Date - 2021-04-12T12:41:01+05:30 IST