కామంతో కళ్లుమూసుకుపోయి.. తల్లిలేని 14ఏళ్ల కన్న కూతురుపైనే..

ABN , First Publish Date - 2020-07-29T15:16:15+05:30 IST

కంటికి రెప్పల కాపాడాల్సిన..

కామంతో కళ్లుమూసుకుపోయి.. తల్లిలేని 14ఏళ్ల కన్న కూతురుపైనే..

కను రెప్పే కాటేసింది

14ఏళ్ల కుమార్తెపై కొంతకాలంగా తండ్రి అత్యాచారం

కడుపునొప్పి రావడంతో వైద్య పరీక్షలు

రెండు నెలల గర్భవతిగా నిర్ధారణ

పోలీసులకు సమాచారం.. కేసు నమోదు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

దిశ పోలీసు స్టేషన్‌కు కేసు బదిలీ


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): కంటికి రెప్పల కాపాడాల్సిన కన్న తండ్రే ఆ బాలికను కాటేశాడు. కామంతో కళ్లుమూసుకుపోయి రక్తం పంచుకుపుట్టిన బిడ్డపైనే అత్యాచారానికి తెగబడ్డాడు. కొంతకాలం నుంచి అత్యాచారానికి పాల్పడుతుండడంతో బాలిక అస్వస్థతకు గురైంది. ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా గర్భవతిగా తేలింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని రైల్వే న్యూకాలనీకి చెందిన ఒక వ్యక్తి ప్రైవేటుగా ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు. ఇతని భార్య కొంతకాలం క్రితం చనిపోయింది. వీరికి ఒక్కతే కుమార్తె(14).


తల్లి లేకపోవడంతో అన్నీ తండ్రే చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో అభం శుభం తెలియని కూతురుపై కన్నేశాడు. మాయమాటలతో ఆ చిన్నారిని లొంగదీసుకుని కొంతకాలం నుంచి తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం కడుపు నొప్పి వస్తున్నదని తండ్రికి చెప్పడంతో మంగళవారం గురుద్వారా జంక్షన్‌లో వున్న ఒక ప్రైవేటు మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు చేయడంతో బాలిక రెండు నెలల గర్భవతి అని రిపోర్టులు వచ్చాయి. బాలికను కేజీహెచ్‌కు తీసుకెళ్లగా.. అక్కడి నుంచి ఎంఎల్‌సీ కేసుగా నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కేజీహెచ్‌కు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ ప్రేమ్ కుమార్ కేసు నమోదు చేసి, దిశ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.

Updated Date - 2020-07-29T15:16:15+05:30 IST