Abn logo
Aug 11 2020 @ 04:36AM

రైల్వే ప్రైవేటీకరణ తగదు

పలాస, ఆగస్టు 10: రైల్వేశాఖ ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే శ్రామిక్‌ యూనియన్‌ నాయకులు హెచ్చరించారు. ప్రైవేటీకరణ జరిగితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై కార్మికులకు జాగృతం చేసే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిం చారు. పలాస బ్రాంచ్‌ పరిధిలోని పలాస నుంచి జాడుపూడి వరకు ఉన్న రైల్వే స్టేషన్లలో పనిచేస్తున్న రైల్వే కార్మికులను కలిసి పరిస్థితిని వివరించారు. ఈ సంద ర్భంగా ఆ సంఘ అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ మట్ట రామకృష్ణ విలేఖరులతో మా ట్లాడుతూ.. రైల్వే ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగా వకా శాలు కోల్పోవడంతో పాటు ప్ర స్తుత ఉద్యోగులకు రాయితీలు రావన్నారు. కార్యక్రమంలో బ్రాంచి కార్యదర్శి ఎం. ఉమామహేశ్వరరావు, డీవీ రావు, పీవీవీఎన్‌.రావు, ఎ.రాము, పి.కామే శ్వరరావు, సింహాచలం, ఎండీవీ రమణ, పి.చలపతిరావు, డీడీ రావు, ఎన్‌సీఎస్‌ రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement