రైల్వే పాఠశాలల మూత

ABN , First Publish Date - 2021-10-12T15:58:37+05:30 IST

చెన్నై, అరక్కోణం సహా ఆరు ప్రాంతాల్లో ఉన్న రైల్వే పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమైంది. దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో పెరంబూరు, అరక్కోణం, మదురై, తిరుచ్చి, ఈరోడ్‌, పోతనూరు ప్రాంతాల్లో రైల్వే

రైల్వే పాఠశాలల మూత

చెన్నై: చెన్నై, అరక్కోణం సహా ఆరు ప్రాంతాల్లో ఉన్న రైల్వే పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమైంది. దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో పెరంబూరు, అరక్కోణం, మదురై, తిరుచ్చి, ఈరోడ్‌, పోతనూరు ప్రాంతాల్లో రైల్వే పాఠశాలలు దశాబ్ధాలుగా నడుస్తున్నాయి. రైల్వే బోర్డు ప్రతిపాదనల మేరకు ఈ ఆరు పాఠశాలలను మూసివేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రైల్వేశాఖకు చెందిన స్థలాలను వాణిజ్య పరంగా మార్చి ఆదాయాన్ని పెంచుకునే నిమిత్తం ఈ చర్యలు తీసుకోనున్నట్టు వారు తెలిపారు. రాష్ట్రంలోని ఆరుచోట్ల నిర్వహిస్తున్న రైల్వే పాఠశాలల్లో 2627 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిని వేరే పాఠశాలల్లో చేర్పించాలంటూ వారి తల్లిదండ్రులకు దక్షిణ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులున్న రైల్వే పాఠశాలలను కేంద్రీయ విద్యాలయలో విలీనం చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. రైల్వే శాఖ పాఠశాలలను మూసివేతపై దక్షిణ రైల్వే కార్మిక సమ్మేళనం ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-10-12T15:58:37+05:30 IST