నైరుతి Railway zoneలో తొలి కాంట్రాక్టు పార్సిల్‌ రైలు

ABN , First Publish Date - 2021-10-24T18:18:55+05:30 IST

నైరుతి రైల్వేజోన్‌ పరిధిలో తొలిసారిగా పార్సిల్‌ సర్వీసులకు కంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఈమేరకు బెంగళూరు విభాగం ప్రజాసంబంధాల అధికారి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్గో పార్సిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (పీసీఈటీ)

నైరుతి Railway zoneలో తొలి కాంట్రాక్టు పార్సిల్‌ రైలు

బెంగళూరు(Karnataka): నైరుతి రైల్వేజోన్‌ పరిధిలో తొలిసారిగా పార్సిల్‌ సర్వీసులకు కంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఈమేరకు బెంగళూరు విభాగం ప్రజాసంబంధాల అధికారి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్గో పార్సిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (పీసీఈటీ)ను శనివారం యశ్వంతపుర రైల్వే స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలు యశ్వంతపుర(బెంగళూరు) నుంచి ఓఖ్లా (న్యూఢిల్లీ) వరకు సంచరించనుంది. చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ అనిల్‌ పవిత్రన్‌, రైల్వే అధికారులు హరిశంకర్‌ వర్మ, శ్యామ్‌సింగ్‌, సంజయ్‌గుప్తాలతోపాటు ఏవీజీ లాజిస్టిక్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పాల్గొన్నారు. ఆరేళ్ల అవధికి పార్సిల్స్‌ను లోడ్‌ చేసేందుకు పూర్తిగా కంట్రాక్టు ఇచ్చారు. ఇందుకుగాను రూ.241కోట్లు సంస్థ చెల్లించనుంది. ఇందులో 15 పార్సిల్‌ వ్యాన్‌లు, 1 బ్రేక్‌ వ్యాన్‌ ఉండడంతో ఒకేసారి 353 టన్నులు మోసే అవకాశం ఉంది. ఆరు నెలల అనంతరం 20 పార్సిల్‌ వ్యాన్‌లు, ఒక బ్రేక్‌వ్యాన్‌కు అవకాశం కల్పించనున్నారు. తద్వారా 491టన్నులకు సామర్థ్యం పెరగనుంది. మూడేళ్లపాటు రవాణాచార్జీలు పెంచేం దుకు వీలులేదు. 4వ ఏడాది 10శాతం పెరగనుంది. ఈ పార్సిల్‌రైలు సరుకు రవాణాకు ఎంతో అనుకూలం కానుందన్నారు. 

Updated Date - 2021-10-24T18:18:55+05:30 IST