ప్రయాణికులకు రైల్వే శాఖ తీపికబురు

ABN , First Publish Date - 2020-06-05T01:02:29+05:30 IST

ప్రయాణికులకు రైల్వే శాఖ తీపికబురు

ప్రయాణికులకు రైల్వే శాఖ తీపికబురు

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే శాఖ శుభవార్త అందించింది. రూ. 1885 కోట్ల రీఫండ్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. లాక్ డౌన్ కాలంలో టికెట్లను రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లిస్తున్నట్లు భారత రైల్వే శాఖ పేర్కొంది. జూన్ 30 వరకు బుక్ చేసుకున్న టికెట్లను రైల్వే శాఖ రద్దు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్న టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

Updated Date - 2020-06-05T01:02:29+05:30 IST