వచ్చే 10 రోజుల్లో 36 లక్షల మంది వలస కార్మికులను తరలించనున్న రైల్వే

ABN , First Publish Date - 2020-05-24T00:00:06+05:30 IST

వచ్చే పది రోజుల్లో 19 రాష్ట్రాల్లోని 36 లక్షల మంది వలస కార్మికులను 16 గమ్యస్థాన రాష్ట్రాలకు తరలించేందుకు

వచ్చే 10 రోజుల్లో 36 లక్షల మంది వలస కార్మికులను తరలించనున్న రైల్వే

న్యూఢిల్లీ: వచ్చే పది రోజుల్లో 19 రాష్ట్రాల్లోని 36 లక్షల మంది వలస కార్మికులను 16 గమ్యస్థాన రాష్ట్రాలకు తరలించేందుకు రైల్వే సిద్ధమైంది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 45 లక్షల మందిని తరలించినట్టు పేర్కొంది. ‘‘వచ్చే పది రోజుల్లో 2,600 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడుపుతాం. 19 రాష్ట్రాల నుంచి 16 గమ్యస్థాన రాష్ట్రాలకు రైళ్లు నడుపుతాం. మొత్తంగా 36 లక్షల మందిని తరలిస్తాం’’ అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కాగా, జూన్ 1 నుంచి రైల్వే 200 ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన టికెట్ల బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం నడుస్తున్న 30 రాజధాని రైళ్లకు ఇవి అదనం.  

Updated Date - 2020-05-24T00:00:06+05:30 IST