న‌డ‌వనున్న లోక‌ల్ రైళ్లు... ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కే ప్ర‌యాణ స‌దుపాయం!

ABN , First Publish Date - 2020-07-01T12:25:40+05:30 IST

దేశంలో అన్‌లాక్‌-2 ప్రారంభ‌మ‌య్యింది. ఈ నేప‌ధ్యంలో మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో ఈరోజు నుంచి 35ం లోక‌ల్‌రైళ్లు న‌డ‌వ‌నున్నాయి. అయితే వీటిలో ప్ర‌యాణించేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు...

న‌డ‌వనున్న లోక‌ల్ రైళ్లు... ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కే ప్ర‌యాణ స‌దుపాయం!

ముంబై: దేశంలో అన్‌లాక్‌-2 ప్రారంభ‌మ‌య్యింది. ఈ నేప‌ధ్యంలో మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో ఈరోజు నుంచి 35ం లోక‌ల్‌రైళ్లు న‌డ‌వ‌నున్నాయి. అయితే వీటిలో ప్ర‌యాణించేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మాత్ర‌మే అనుమ‌తినివ్వ‌నున్నారు. సామాన్య ప్ర‌యాణికుల‌కు వీటిలో ప్రయాణించే అవ‌కాశం ప్ర‌స్తుతానికి లేద‌ని రైల్వేశాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట్ర‌ప్ర‌భుత్వాల ఉద్యోగులు, ఐటి, జిఎస్‌టి, కస్టమ్స్, పోస్టల్, నేషనలైజ్డ్ బ్యాంకులు, ఎంబిపిటి, న్యాయవ్యవస్థ, రక్షణ, రాజ్‌భవన్ ఉద్యోగులకు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. సాధారణ ప్రయాణికుల కోసం లోక‌ల్ రైళ్ల సేవ‌ల‌ను ఇంకా ప్రారంభించలేదని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేర‌కు ముంబై సబర్బన్ రైలు మార్గంలో అత్య‌వ‌స‌ర‌ సేవలకు 362 లోక‌ల్ రైళ్లు నడ‌వ‌నున్నాయి. ఈ రైళ్ల‌లో రోజుకు సుమారు 1.25 లక్షల మంది ఉద్యోగులు ప్రయాణించనున్నారు. అత్యవసర సేవల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారికోసం మాత్రమే ఈ లోక‌ల్ రైళ్ల‌ను న‌డుపుతున్నట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. 

Updated Date - 2020-07-01T12:25:40+05:30 IST