కిటకిటలాడుతున్న బస్టాండ్లు

ABN , First Publish Date - 2021-10-13T08:51:37+05:30 IST

బతుకమ్మ, దసరా పండుగలకు నగర ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు తరలి వెళ్తుండటంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.

కిటకిటలాడుతున్న బస్టాండ్లు

ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ చార్జీలే.. రద్దీకి తగినన్ని బస్సుల ఏర్పాటు

ప్రయాణికులు 30 మందికి మించితే కోరిన ప్రాంతానికే ప్రత్యేక బస్సు

అరకొరగా ప్రత్యేక రైళ్లు.. ఇబ్బందులు పడుతున్న దూరప్రాంతవాసులు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ, దసరా పండుగలకు నగర ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు తరలి వెళ్తుండటంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రద్దీకి తగిన విధంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా, దక్షిణమధ్యరైల్వే మాత్రం తగినన్ని రైళ్లను నడపడంలేదు. దాంతో దూరప్రాంత ప్రయాణికులు అనేక ఇబ్బందు లు పడుతున్నారు. ఎంజీబీఎస్‌, జేబీఎ్‌సతో పాటు సీబీఎస్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బ స్టాండ్లలో మంగళవారం రద్దీ బాగా పెరిగింది. రెండు రోజులుగా  ప్రయాణికుల రద్దీ పెరగడంతో ప్రత్యేక బస్సులు పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులను శివారు ప్రాంతాల నుంచి నడుపుతున్నారు. 30మందికి పైగా ప్రయాణికులు ఒకేసారి సొంతూళ్లకు వెళ్తామంటే బస్సులను నేరుగా కోరిన ప్రాంతానికి, కాలనీలకు పంపించేలా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎంజీబీఎ్‌సకు వచ్చిన ప్రయాణికులు ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, జేబీఎ్‌సలకు వెళ్లేందుకు ప్రతి పదినిమిషాలకు ఒక సిటీ బస్సు నడుపుతోంది.


సీబీఎస్‌ నుంచి కర్నూల్‌, తిరుపతి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, ఆనంత పురం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, మదనపల్లిలకు రోజువారీ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సుల్లో కూడా సాధారణ చార్జీలే వసూలు చేస్తుండటంతో  ప్రయాణికులు ఆర్టీసీబస్సుల్లోనే వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి తగినట్లుజిల్లాలకు బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ చెప్పారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, సీబీఎస్‌, ఉప్పల్‌క్రా్‌సరోడ్‌ల నుం చి 1500 కు పైగా ప్రత్యేక బస్సులు జిల్లాలకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రత్యేక బస్సు ల సమాచారం కోసం ఆర్టీసీ కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసింది. 040-68153333, 040- 30102829 నెంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఎంజీబీఎస్‌ (9959226257) జూబ్లీబస్‌ స్టేషన్‌ (9959226246), రేతిఫైల్‌ బస్‌ స్టేషన్‌ (9959226154), కోఠీ బస్‌ స్టేషన్‌(9959226160) నంబర్లలో బస్సుల సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు.


అరకొరగా ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే అధికారులు దసరా పండుగ ప్రత్యేక రైళ్లను అరకొరగా నడుపుతున్నారు.  ప్రతిఏటా వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేవారు. ప్రస్తుతం పదు ల సంఖ్యలో మాత్రమే నడుపుతున్నారు. దీంతో జంట నగరాల ప్రజలు మూడు రోజులుగా ఇబ్బందులుపడుతున్నారు.  2019లో దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 31 వరకు దక్షిణ మధ్య రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలకు 780 ప్రత్యేక రైళ్లను నడిపింది. కరోనా వల్ల 2020లో ప్రత్యేక రైళ్లను నడపలేదు. ప్రస్తుతం 274సాధారణ, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లతోపాటు 38ప్రత్యేక రైళ్లను మాత్ర మే నడుపుతున్నారు. దాంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా రు. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌కు రెండు, సికింద్రాబాద్‌-కాకినాడటౌన్‌కు రెండు, పూర్ణా-తిరుపతికి6, టాటా-కాచిగూడకు6, విశాఖపట్నం-సికింద్రాబాద్‌కు 6, విశాఖపట్నం-తిరుపతికి4, సికింద్రాబాద్‌-విశాఖపట్నంకు 4 అప్‌అండ్‌డౌన్‌ 30రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. చెన్నయ్‌ సెంట్రల్‌-సాంత్రగాచికి 8 రైళ్లు నడుస్తాయని చెప్పారు. 


14, 17, 18 తేదీల్లో దసరా ప్రత్యేక రైళ్లు 

దసరా సందర్భంగా 14, 17, 18 తేదీల్లో 3 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.  సికింద్రాబాద్‌- కాకినాడ టౌన్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి ఈనెల 14వ తేదీ రాత్రి 11.55కు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10.10కి కాకినాడ టౌన్‌ చేరుతుంది. మచిలీపట్నం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు మచిలీపట్నం నుంచి 17రాత్రి 9.05కు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.05కి సికింద్రాబాద్‌ చేరుతుంది.లింగంపల్లి-విజయవాడ  రైలు లింగంపల్లి నుంచి 18 రాత్రి 10.45కు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.35కు విజయవాడ చేరుతుంది. తిరుపతి-అకోలా మధ్య ఈ నెల 15 నుంచి నవంబర్‌ 14 వరకు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ రైలు తిరుపతిలో 15 నుంచి నవంబరు 12 వరకూ ప్రతి శుక్రవారం, అకోలాలో  17 నుంచి నవంబరు 14 వరకూ ప్రతి ఆదివారం బయలుదేరుతుంది.  

Updated Date - 2021-10-13T08:51:37+05:30 IST