గాలిదుమారంతో వర్షం

ABN , First Publish Date - 2021-04-11T05:58:38+05:30 IST

గాలిదుమారంతో వర్షం

గాలిదుమారంతో వర్షం
కల్లాల్లో ధాన్యాన్ని కుప్ప చేస్తున్న రైతులు

కరకగూడెంలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం

భద్రాచలంలో తెగిపడిన విద్యుత్‌ తీగలు

కరకగూడెం/భద్రాచలంటౌన్‌, ఏప్రిల్‌ 10: భద్రాద్రి జిల్లాలో శనివారం సాయంత్రం పలుచోట్ల గాలిదుమారంతో వర్షం కురిసింది. దాంతో రైతులు ఆందోళన చెందారు. కరకగూడెం మండలంలో సాయంత్రం గాలి దుమారానికి కరకగూడెం-పినపాక ప్రధాన రహదారిపై బంగారుగూడెం వద్ద భారీ వృక్షం నెలకొరిగింది. వర్షం కూడా కురవడంతో మండలంలోని రైతులు ఆందోళనకు గురయ్యారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, ధాన్యం వర్షానికి తడవకుండా కాపాడేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. వాటిని కుప్పలుగా చేర్చి పట్టాలు కప్పారు.  

భద్రాద్రిలో గాలిదుమారం

భద్రాద్రిలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన గాలి బీభత్సం సృష్టించింది. గాలిదుమారానికి పలు కాలనీలో విద్యుత్‌ తీగలు తెగిపడిపోయాయి. దీంతో పట్టణంలో రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పాడింది. వెంటనే స్పందించిన విద్యుత్‌ అధికారులు మరమ్మతులు చేసి విద్యుత్‌ను పునఃరుద్దించారు.

 

Updated Date - 2021-04-11T05:58:38+05:30 IST