అకాలవర్షం..అన్నదాత ఆగమాగం

ABN , First Publish Date - 2021-05-11T06:18:46+05:30 IST

ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌, పదిర గ్రామాల్లో సోమవారం అర గంట పాటు కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు తిప్పలు పడ్డారు.

అకాలవర్షం..అన్నదాత ఆగమాగం
వీర్నపల్లిలోని శాంతినగర్‌లో రోడ్డుపై కొట్టుకుపోయిన ధాన్యం

- తడిసి ముద్దయిన ధాన్యం 

- వీర్నపల్లి శాంతినగర్‌లో గాలివాన బీభత్సం 

- ఎగిరిపడిన ఇంటి పైకప్పులు  

ఎల్లారెడ్డిపేట, మే 10: ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌, పదిర గ్రామాల్లో సోమవారం అర గంట పాటు కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు తిప్పలు పడ్డారు. సుమారు 100 క్వింటాళ్ల ధాన్యం త డిసి ముద్దయ్యింది. ధాన్యం రాసులలో నిలిచిన నీటిని తొలగించేందుకు కష్టపడ్డారు. ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇల్లంతకుంటలో.. 

 ఇల్లంతకుంట: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేం ద్రాల్లోని ధాన్యం తడిసింది. రేపాక, వల్లంపట్ల, జంగమరెడ్డిపల్లె, అనంతారం తదితర గ్రామాల్లో రైతులు ధాన్యాన్ని ఆరబోశారు.  అందరికీ టార్పాలిన్లు అందు బాటులో లేకపోవడంతో ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం ఆలస్యమవడంతోనే ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

వీర్నపల్లిలో గాలివాన బీభత్సం

వీర్నపల్లి: భారీ వర్షం వీర్నపల్లి మండలంలోని శాంతినగర్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కురిసిన జడివానకు గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది.  పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.  గ్రామంలోని చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయా యి. దీంతో గ్రామంలో అంధకారం నెలకొంది. 45 ని మిషాలపాటు కురిసిన వర్షానికి  ప్రజలు బిక్కుబిక్కుమంటూఇళ్లలో ఉండిపోయారు. గ్రామంలోని సమ్మక్క, సారలమ్మ దేవాలయానికి విగ్రహాలు రాగా గ్రామస్థు లు సర్పంచ్‌ మల్లేశంతో సహా విగ్రహాలు దించేందుకు వెళ్లారు. ఒక్కసారిగా పెనుగాలులతో కూడిన వర్షం రావడంతో గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు ఈదురు గాలికి కొంత దూరం కొట్టుకుపోగా గ్రామస్థులు వారిని కాపాడారు. తెల్లారితేగానీ ఎంత నష్టం జరిగిందో అంచనాకు రాదని సర్పంచ్‌ మల్లేశం తెలిపారు. గర్జనపల్లి, వన్‌పలి గ్రామాల్లో కురిసిన వర్షానికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. 

Updated Date - 2021-05-11T06:18:46+05:30 IST