‘నైరుతి’రాగం

ABN , First Publish Date - 2021-06-18T05:16:29+05:30 IST

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి పా లమూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

‘నైరుతి’రాగం
నారాయణపేట శివారులో కరుస్తున్న వర్షం

- ఉమ్మడి పాలమూరు జిల్లాలోకి నైరుతి ప్రవేశం

- చల్లబడిన వాతావరణం

- పలకరించిన తొలకరి వర్షం

- విత్తనాలు విత్తుకునేందుకు సమయం ఆసన్నం

- సంబురాల్లో రైతాంగం

- పాలమూరులో పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

- పలు పట్టణాల్లో రోడ్లన్నీ జలమయం


మహబూబ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/నాగర్‌క ర్నూల్‌ (ఆంధ్రజ్యోతి)/నారాయణపేట, జూన్‌ 17 : నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి పా లమూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్‌లో గురువారం ఓ మోస్తరు వర్షం కురవగా, జిల్లా వ్యాప్తంగా అ న్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి. గాలులతో కూడిన వాన కురవడంతో మి డ్జిల్‌, హన్వాడ, మహబూబ్‌నగర్‌, నవాబు పేట, జడ్చర్ల ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు తెగడం, లైన్లపై చెట్ల కొమ్మలు పడ టంతో సరఫరా ఆగిపోయింది. తొల కరి ప్రారంభమయ్యాక ఈ వర్షమే బలంగా కురిసింది. జిల్లా వ్యాప్తం గా సాయంత్రం మూడు గంట ల నుంచి మబ్బులు ప ట్టిన వాతావ రణం నెలకొనగా, సాయంత్రం 5.30 నుంచి గాలులు, వాన మొదలైంది. ఆ రున్నర వరకు వర్షం పడుతూనే ఉండటంతో, జిల్లా వ్యాప్తంగా 1.30 మి ల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో పలు కాలనీల్లో వానకు రోడ్లపైకి వరద చేరింది. సీజన్‌లో మొ దటిసారి మంచి వర్షం పడిందని, దీంతో ఇక విత్తనాలు వేసేందుకు అను వైన పదును ఉంటుందని రైతులు పేర్కొన్నారు.

నారాయణపేట పరిసర ప్రాంతాలతో పాటు దామరగిద్ద, మ ద్దూర్‌ మండలాల్లో గురువారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. ఈ వర్షంతో వానాకాలం సాగు కు కలిసి వచ్చింది. ఇదివరకే కొందరు రైతులు కంది, పెసర, పత్తి వి త్తనాలు విత్తుకోగా, తాజాగా కురి సిన వర్షంతో కొంత ఊరట చెందారు. అలాగే జిల్లాలోని మండలాల వారీగా అత్యధికంగా మక్తల్‌లో 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం, అత్య ల్పంగా కృష్ణాలో 0.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. దామరగిద్దలో 4.4 మీ.మీ., నారాయణపేటలో 2.4 మీ.మీ., నర్వలో 3.8 మీ.మీ., మరికల్‌లో 1.5 మీ.మీ., ధన్వాడలో 1.0 మీ.మీ., మద్దూర్‌లో 2.2 మీ. మీ., కోస్గిలో 2.0 మీ.మీ. వర్షం కురియగా, మాగనూర్‌, ఊట్కూర్‌ మం డలాల్లో వర్షం కురియలేదు. జిల్లా వ్యాప్తంగా 23.1 మీ.మీ. వర్షపాతం న మోదు కాగా, 2.1 మీ.మీ. సాధారణ వర్షపాతం నమోదైంది.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. తెల్లవా రుజాము నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లటి గాలులు వీ స్తున్నాయి. నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లా పూ ర్‌ నియోజకవర్గాల్లోని తాడూరు, పెద్దకొత్తపల్లి, నా గర్‌కర్నూల్‌, అమ్రాబాద్‌, చారకొండ మం డలాల్లో చినుకులు పడ్డాయి. ఈ వర్షం సాగుకు జీవం పోసింది.

Updated Date - 2021-06-18T05:16:29+05:30 IST