Abn logo
Sep 27 2021 @ 23:52PM

తడిసిముద్దయిన నగరం

మూడోంతెనెల కింద నిలబడిన వర్షపు నీరు

‘గులాబ్‌’ ప్రభావంతో చెరువులుగా మారిన రోడ్లు

గుంటూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గులాబ్‌ తుఫాన ప్రభావం నగరంపై పడింది. దీంతో ఉదయం 5గంటలకు చిరుజల్లులతో మొదలై  మధ్యాహ్నం 12 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగరంలోని డొంకరోడ్డు, శ్రీనగర్‌ కాలనీ, అరండల్‌పేట, ఏటీ అగ్రహారం, సుద్దపల్లిడొంక, ప్రగతినగర్‌ తదితర ప్రాంతాలతోపాటు నగర శివార్లు జలమయమయ్యాయి. ఎడతెగని వర్షంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి.  పలుప్రాంతాల్లో సరైన డ్రెయినలు లేక వర్షంనీరు రోడ్డుపైనే నిలిచాయి. నగరంలోని మున్సిపల్‌ కమిషనర్‌ బంగ్లా వద్ద రోడ్డుపైన మురికినీరు చేరింది. దీనికి తోడు జిల్లా రిజిసా్ట్రర్‌ కార్యాలయ ఆవరణలో వర్షపునీరు నిలబడి చెరువును తలపించింది. గుంతలమయంగా మారిన రోడ్లలో వర్షపునీరు చేరడంతో ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితుల్లో వాహనదారులు తీవ్ర ఇక్కట్లుకు గురయ్యారు. ప్రధానంగా గుజ్జనగుండ్ల మీదుగా పలకలూరు రోడ్డు గుండా పేరేచర్లకు వెళ్లే మార్గం వాహనదారులకు అగ్నిపరీక్ష పెట్టింది. ఈ తుఫాన ప్రభావం మరో రెండు రోజులు ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించడంతో నగర శివారుకాలనీ ప్రాంతప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  

కార్పొరేషన కార్యాలయం వద్ద నిలిచిన వర్షపు నీరును తొలగిస్తున్న సిబ్బంది