జిల్లా అంతటా జడివాన

ABN , First Publish Date - 2020-11-28T06:20:35+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో జడివాన కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.

జిల్లా అంతటా జడివాన

ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం..

అత్యధికంగా ఎన్‌పీకుంటలో 244.8 మి.మీ వర్షపాతం

అనంతపురం వ్యవసాయం, నవంబరు 27 : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో జడివాన కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. కదిరి ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మిగిలిన ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం పడటంతో జిల్లా అంతటా చల్లటి వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంతోపాటు పట్టణ ప్రాంతాల్లో జన సంచారం తగ్గింది.  


కొనసాగిన  తుఫాన్‌ ప్రభావం 

జిల్లాలో నివర్‌ తుఫాన్‌ ప్రభావం కొనసాగింది. కదిరి, తనకల్లు, తలుపుల, గాండ్లపెంట,  నల్లచెరువు, తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అనంతపురం, ముదిగుబ్బ, గుత్తి, యాడికి, ధర్మ వరం, నార్పల, బత్తలపల్లి, కనగానపల్లి, ఆత్మకూరు, పామిడి, బుక్కరాయసముద్రం, వజ్రకరూరు, పుట్లూరు, పెద్దవడుగూరు, పుట్టపర్తి, రాప్తాడు, తాడిమర్రి, బుక్కపట్నం, బెళుగుప్ప, గుంతకల్లు, శింగనమల తదితర మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గార్లదిన్నె, ఉరవకొండ, కంబదూరు, యల్లనూరు, విడపనకల్లు, తాడిపత్రి, బొమ్మనహాళ్‌ కదిరి, డీ.హీరేహాళ్‌, రామగిరి, అమడగూరు, ఓడీచెరువు, పెనుకొండ, కూడేరు, పెద్దపప్పూరు, గోరంట్ల, కళ్యాణదుర్గం తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. గురువారం ఉ ద యం నుంచి రాత్రి దాకా అన్ని మండలాల్లో వర్షం పడింది. అత్యధికం గా ఎన్‌పీకుంటలో 244.8 మి.మీ వర్షపాతం నమోదైంది. నల్లచెరువు 126.6, గాండ్లపెంట 105.0, తలుపుల 94.4,  కదిరి 73.4, తనక ల్లు 69. 6, ముదిగుబ్బ 67.4, ఓడీచెరువు 64.2, అమడగూరు 63.8, యల్లనూ రు 56.0, నల్లమాడ 54.2, పుట్టపర్తి 43.6మి.మీల వర్షపాతం నమోదైం ది. మిగిలిన మండలాల్లో 35.8 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. 


భారీగా పంట నష్టం 

జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షానికి భారీగా పంటనష్టం జరిగింది. కోత దశకు చేరిన వరి పంట బాగా దెబ్బతింది. జిల్లాలోని 15 మండలాల్లో 706.5 హెక్టార్లల్లో వరి, తలుపులలో 4 హెక్టార్లల్లో వేరుశనగ, తనకల్లు, పుట్టపర్తి మండలాల్లో 6.41 హెక్టార్లల్లో మొక్కజొన ్న పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసిం ది. క్షేత్ర స్థాయిలో అంతకు రెండింతలు పంటనష్టం జరిగినట్లు సమాచారం. వివరాల సేకరణలో ఆయా మం డలాల వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు.  

Updated Date - 2020-11-28T06:20:35+05:30 IST