Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీడని వర్షం

ఊటక్కెన రోడ్లు, నానుతున్న ఇళ్లు
ఆందోళనలో ప్రజలు
కావలి, నవంబరు 28: వరుస అల్పపీడన ప్రభావాలతో నెల రోజులు నుంచి వర్షాలు పడుతూనే ఉండటంతో భూమి ఊటెక్కి ఇళ్లు నానుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 20 రోజులు వరుసగా కురిసన వర్షాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్లీ అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా వర్షాలు పడుతుండటంతో చెరువులు, వాగులు, వంకలు, నీటి గుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే భూమి ఊటెక్కిన ఇళ్లల్లో ఉండడానికి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పట్టణ శివారు ప్రాంతా కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేకపోవటంతో వర్షపు నీటితో జలమయమయ్యాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేక నరకయాతన పడుతున్నారు. ట్రంకు రోడ్డు సైతం వర్షాలకు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా వరిఇంది. ఈ వర్షాలు మరింత పేరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెపుతుండటంతో ప్రజలకు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు కొద్దిపాటి వర్షం పడినా, గాలి వీచినా ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తుండడంతో శివారు ప్రాంత ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ప్రజలు ఇంత ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు మొక్కుబడిగా వర్ష ప్రభావం పెద్దగా లేని ప్రాంతాల్లో పర్యటిస్తూ మమా అనిపిస్తున్నరే తప్ప ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల వైపు కన్నెత్తికూడా చూడలేదని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement