ఏపీకి వర్ష సూచన

ABN , First Publish Date - 2020-09-23T21:32:32+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది

ఏపీకి వర్ష సూచన

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 


ఉత్తర కోస్తాలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. 


దక్షిణ కోస్తాలో ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల  కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల  కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది               

రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Updated Date - 2020-09-23T21:32:32+05:30 IST