జిల్లాకు వర్ష సూచన

ABN , First Publish Date - 2020-08-13T11:24:32+05:30 IST

వాయువ్య బంగాళాఖాతంలో గురువారం అల్ప పీడనం ఏర్పడనుండడంతో నాలుగురోజులపాటు మన జిల్లాకు భారీ వర్షసూచన

జిల్లాకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం


అమలాపురం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : వాయువ్య బంగాళాఖాతంలో గురువారం అల్ప పీడనం ఏర్పడనుండడంతో నాలుగురోజులపాటు మన జిల్లాకు భారీ వర్షసూచన ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈనెల 13వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ప్రకటించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. 

Updated Date - 2020-08-13T11:24:32+05:30 IST