వర్షం.. బీభత్సం

ABN , First Publish Date - 2020-09-20T08:37:56+05:30 IST

జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తు న్నాయి...

వర్షం.. బీభత్సం

నీట మునిగిన పంటలు

పొంగిపొర్లిన వాగులు, వంకలు


గద్వాల రూరల్‌, సెప్టెంబరు 19: జిల్లాలో  కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు బీభత్సాన్ని  సృష్టిస్తు న్నాయి. కొత్తపల్లి తుమ్మలకుంట చెరువు తెగిపో వడంతో వరిపొలాలు నీటమునిగాయి. కొత్తపల్లి- గద్వాల రాకపోకలు నిలిచాయి. సంగాల చెరువు అ లుగుపారడంతో పెద్దఎత్తున నీళ్లు బయటికిపోయి శెట్టిఆత్మకూర్‌ వంపులోకి చేరి గ్రామాన్ని దిగ్బంధం చేసింది. గద్వాల-డ్యాం రోడ్డుపై నీళ్లుపారి రాకపో కలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లడబండ, గుం టిపల్ల లత్తీపురం కల్వర్టులు పొంగడంతో రాకపో కలు నిలిచిపోయాయి. తహసీల్దార్‌ సత్యనారా య ణ, ఏఈ సుచరిత గ్రామాలను తిరిగి పంట నష్టం తో పాటు 11 కూలిన ఇళ్లను పరిశీలించారు.  వంద ఎకరాలకు పైగా పంట నష్టం కలిగింది.  


రాకపోకలకు అంతరాయం

ధరూరు: మండలంలోని నీలహల్లి, నెట్టెంపాడు  గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి.  ప లు గ్రామాల్లో వాగులు, వంకలు  పొంగి పారుతుం డడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాగర్‌దొడ్డిలో ఇళ్లలోంచి నీటిబుగ్గలా ఊటలు వస్తున్నాయి. నీరు ఎక్కువయ్యేకొద్ది ఆ నీటిని బ కెట్ల సహాయంతో తోడేస్తున్నారు. మండలంలోని చిన్నపాడు, రేవులపల్లి, భీంపురం, పారుచెర్ల, చింతరేవుల గ్రామాల్లో నీట మునిగిన పంటలను జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్‌ పరిశీలించారు. భారీ వర్షాలకు చెరువు లు, ప్రాజెక్టులు  పొంగి పొర్లుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సుందర్‌రాజు తెలిపారు. నెట్టెంపాడు, నాగర్‌దొ డ్డి, చింతరేవుల, ఉప్పేరు, ఖమ్మంపాడు, నర్సన్‌దొడ్డి, రేవులపల్లి, పెద్దచింతరేవుల గ్రామస్థులను అప్ర మత్తం చేయాలని వీఆర్‌వో, వీఆర్‌ఏలను ఆదేశించారు. 


గోడ కూలి వాహనం ధ్వంసం

గద్వాల క్రైం: గద్వాల పట్టణంలో శనివారం ఉదయం కురిసిన వర్షానికి గోడకూలి వాహనం ధ్వంసం సంఘటన చోటుచేసుకున్నది. గద్వాల ప ట్టణంలోని మోమిన్‌మెహల్లా కాలనీకి చెందిన స నావుల్లా అనే వ్యక్తి ఇంటిగోడ వర్షానికి తడిచి ఒక్క సారిగా కూలిపోవడంతో ఆ గోడ పక్కన ఉన్న ఖలీల్‌కు చెందిన  వాహనంపై పడి దెబ్బతిన్నది. ఎవ రు లేకపోవడంతో  ప్రాణనష్ట జరగలేదు.  


ఇళ్లు నేల మట్టం 

మల్దకల్‌: వివిధ గ్రామాల్లో వర్షాలకు 18ఇళ్లు నేలమట్టమయ్యాయి.  నిరాశ్రయులైన వారిని  ప్రభుత్వ పాఠశాలలో తా త్కాలిక వసతి కల్పించాలని గ్రామ కార్యదర్శులకు అధికారులు ఆదేశాలు జారీచేశారు.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరి, పత్తికి  నష్టం చేకూరింది.   


జలమయమైన లోతట్టు కాలనీలు

గద్వాలటౌన్‌: పట్టణంలోని లోతట్టు కాలనీలు జలమయమై వర్షపునీరు ఇళ్లల్లోకి రావడంతో స్ధానికులు ఆందోళనకు గురయ్యారు. రథశాల, రాజీవ్‌మార్గ్‌, పాతబస్టాండ్‌ సర్కిల్‌ తదితర ప్రధానరోడ్డు కూడళ్లు చెరువులను తలపించాయి. ఎమ్యెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బి.ఎస్‌.కేశవ్‌ కౌన్సిలర్లు, అధికారులు తెల్లవారుజామున 5 గంటలనుంచే పట్టణంలో వీధులన్నీ తిరిగి పరిస్థితిని పరిశీలించారు.


ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

అయిజ: మండల ప్రత్యేకాధికారి సురేష్‌,  అధికారులు ప్రజలను  అప్రమత్తం చేశారు. అయి జ సమీపంలోని చిన్నతాండ్రపాడు, మేడికొండ రహదారిలోని పొలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంతెనలపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు అక్కడే ఉండి ఎక్కడి వారిని అక్కడే నిలిపివేశారు.  


వాగును పరిశీలించిన ఎమ్మెల్యే 

అలంపూర్‌:  వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉండవల్లి మండలం బొం కూరులోని వాగు ఉధృతంగా పారుతుండటంతో రెండు రోజుల నుంచి అంతర్జాతీయ రహదారికి రాకపోకలు నిలిచిపోగా శనివారం ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్ష వాగును పరిశీలించారు. జాతీయ రహదారి అయిన బొం కూరు వాగులో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు పూర్తికా కపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతు న్నట్లు వాహనదారులు వీరి దృష్టికి తెచ్చారు. 


ఆందోళన చెందుతున్న రైతులు

ఇటిక్యాల: ఎడతెరిపి లేని వర్షంతో కంది, మిరప, పత్తి, వరి  నీట మునిగిపోవడంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. మండలంలోని బట్లదిన్నె, బీచుపల్లి, ఇటిక్యాల గ్రామాల్లో పంటలు నీట ముని గినట్టు రైతులు తెలిపారు.  ఇటిక్యాల, ఉదండపు రం, చాగాపురం, శాతర్ల గ్రామాల మధ్య ఉన్న వా గులకు వరద రావడంతో రాకపోకలు నిలిచిపో యాయి. ఇటిక్యాల సమీపంలో ఉన్న చెరువు సైతం అలుగు పారడంతో పంటలు నీటమునిగాయి. 


వర్షపు నీటి సమస్యపై సర్వే

గద్వాలటౌన్‌ : పటణంలోని ఎగువ, లోతట్టు ప్రాంతాలను గుర్తించి వర్షపునీరు సజావుగా ముం దుకు సాగేలా ఏర్పాట్లు చేసేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రైవేట్‌ సర్వే బృందాన్ని రప్పించారు. ఎమ్మె ల్యే పిలుపు మేరకు ఎస్‌కే అసోసియేట్స్‌ బృందం సభ్యులు శనివారం పటణానికి చేరుకొని తమ స ర్వే పనులను ప్రారంభించారు. వారికి బీఎస్‌ కేశవ్‌, అధికారులు ఇక్కడి పరిస్థితులను వివరించారు. 

Updated Date - 2020-09-20T08:37:56+05:30 IST