వర్షం.. నష్టం

ABN , First Publish Date - 2022-07-13T07:03:08+05:30 IST

జిల్లాలో ఐదురోజులుగా కురుస్తున్న వ ర్షాలతో భారీ నష్టం సంభవించింది. నీట ము నిగిన పంటలు, కోతకురైన రోడ్లు, కూలిన ఇళ్ల తో జనజీవనం అతలాకుతలమవుతోంది. నేల కు వంగిన విద్యుత్‌ స్తంభాలు, తెగిన కరెంటు వైర్లతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్ప డుతోంది.

వర్షం.. నష్టం

ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు

పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు

నీట మునిగిన పంటలు, పొలాలు

కూలిన ఇళ్లు, కోతకు గురైన రోడ్లు

జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో నష్టం

నిజామాబాద్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఐదురోజులుగా కురుస్తున్న వ ర్షాలతో భారీ నష్టం సంభవించింది. నీట ము నిగిన పంటలు, కోతకురైన రోడ్లు, కూలిన ఇళ్ల తో జనజీవనం అతలాకుతలమవుతోంది. నేల కు వంగిన విద్యుత్‌ స్తంభాలు, తెగిన కరెంటు వైర్లతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్ప డుతోంది. జిల్లాలో పలుచోట్ల వాగులు రోడ్లపై పారడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డా యి. జిల్లాలో వర్షాలకు 232 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా మూడు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. 58 కరెంటు స్తంభాలు నేలకొరిగా యి. మూడు ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతిన్నాయి. వెరసి జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో వాగులు, చెక్‌డ్యాంలు, చెరువుల మత్తడులు పొంగుతుండడంతో అన్ని గ్రామాల పరిధిలో జలకళ సంతరించుకుంది. నగరంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీల్లోనిలో తట్టు ప్రాంతా ల్లో వరద నీరు వచ్చిచేరుతోంది. వరదలు పెరిగే అవకాశం ఉండడంతో కలెక్టరేట్‌లో ప్రత్యేకసెల్‌ ఏర్పాటు చేసి కలెక్టర్‌ అధికారులతో సమీక్షిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. జి ల్లాలో మంగళవారం 33.7 మి.మీల వర్షం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా మెండోరా మండల కేంద్రంలో 66.3 మి.మీల వర్షం ప డింది. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 269.6 మి.మీల వర్షం పడాల్సి ఉండగా 570.6 మి.మీల వర్షం పడింది. 

10వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 10 వేల ఎకరాల వరకు పంటలు ఇప్పడికే వరదల వల్ల దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధి కారులు అంచనా వేశారు. వరద నీరు చేళ్లలో నిలిచి సోయా ఎక్కువశాతం దెబ్బతిన్నట్లు అ ధికారులు అంచనా వేశారు. వరి పొలాల్లో నీ ళ్లు నాటేయగానే నిల్వ ఉండడంతో కొంతమేర దెబ్బతిన్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 968 చెరువులు ఉండగా 673 చెరువులు పూర్తిస్థాయిలో నిండి మత్తడులు పారుతున్నాయి. మి గతా చెరువులన్నీ 75 నుంచి వందశాతంలోపు నీళ్లు ఉన్నాయి. జనజీవనానికి ఇబ్బందులు లేకుండా సహాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు.  మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తీసుకోవల్సిన చర్యలపై సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, డీఎఫ్‌వో సునీల్‌, డీఆర్‌డీవో చందర్‌, డీపీవో జయసుధ, పంచాయతీరాజ్‌ ఈఈ శంకర్‌ పాల్గొన్నారు.

ఎస్సారెస్పీ 26 గేట్ల ఎత్తివేత

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నుంచి 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మిడ్‌మానేరుకు, కాకతీయ కాల్వ ద్వారా లోయర్‌ మానేరు డ్యాంకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టులో 70టీఎంసీల నీటి నిల్వలు ఉంచుతునే మిగతా వరదను దిగువకు విడుదల చేసేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు.  ప్రాజెక్టులోకి 74720 క్యూసెక్కుల వరద వస్తుండగా 26గేట్లను ఎత్తి 86118 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరికి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి వరద ఇంకా పెరగనుండడంతో వరద కాల్వ ద్వారా 15వేల క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. కాకతీయ కాల్వ ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని లోయర్‌ మానేరుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 74720 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకుగాను 1087.4 అడుగుల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులో 90టీఎంసీలకుగాను 74.506 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. భారీ వరదలు కొనసాగుతుండడంతో కందకుర్తి వద్ద ఇంకా గోదావరి నీటి మట్టం తగ్గలేదు. మంజీరా, హరిద నీళ్లు కూడా వస్తుండడంతో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ప్రాజెక్టు నుంచి బ్యాక్‌ వాటర్‌ కూడా వస్తుండడంతో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన సమాచారం మేరకు గేట్లను పెంచినట్లు ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ చక్రపాణి తెలిపారు. వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నీటి విడుదలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో వరద కాల్వ, కాకతీయ కాల్వలకు కూడా నీటి విడుదల పెంచామని వారు తెలిపారు. 

వరదలపై సమీక్షించిన ఎంపీ అర్వింద్‌

జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ఎంపీ అర్వింద్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, జగిత్యాల కలెక్టర్‌ గూగులోత్‌ రవితో మంగళవారం ఫోన్‌ ద్వారా సమీక్షించారు. పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. నగర శివారులో ప్రాంగా, గూపన్‌పల్లిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎంపీకి కలెక్టర్‌ నారాయణరెడ్డి వివరించారు. అనంతరం ఎంపీ పార్టీ నాయకులతో జూమ్‌ యాప్‌ద్వారా వరదలపై సమీక్షించారు. వర్షాలు కురుస్తున్నందున పార్లమెంట్‌ పరిధిలోని అన్ని మండలాల్లో సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.  సమీక్షలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, దినేష్‌, మల్లికార్జున్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, డాక్టర్‌ వెంకట్‌, పార్టీకి చెందిన మండల అధ్యుక్షులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీని సందర్శించిన ఐజీ కమల్‌హాసన్‌రెడ్డి

మెండోర: శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరదలు వస్తుండడంతో హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ కమల్‌హాసన్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ కేఆర్‌ నాగరాజుతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ చేపడుతున్న బందోబస్తు చర్యలను పరిశీలించారు. ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రాజెక్టుపైకి ఎవరినీ అనుమతించవద్దని పోలీసు లకు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను నది వద్దకు వెళ్లకుండా గ్రామాల్లో డప్పు చాటింపులు చేయించాలన్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో వివరాలను తెలిపారు. ఆయన వెంట ఎస్సారెస్పీ డీఈ సుకుమార్‌, ఆర్మూర్‌ రూరల్‌ సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే మంత్రి అల్లోల శ్రీరామసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు మంత్రికి ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో వివరాలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వాన దేవుని దయతో రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల పంటలకు డోకలేదని ధీమా వ్యక్తం చేశారు  మంత్రి వెంట నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌, ప్రాజెక్టు అధికారులు, నాయకులు ఉన్నారు. అలాగే మాక్లూర్‌ మండలంలోని చిక్లి, గుంజిలి, మందపూర్‌, కొత్తపల్లి, వెంకటాపూర్‌ గ్రామాల్లో నీట మునిగిన పంటలను మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్‌ పరిశీలించారు.

Updated Date - 2022-07-13T07:03:08+05:30 IST