Abn logo
Sep 28 2021 @ 00:37AM

కుండపోత

గంభీరావుపేటలో వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు

- జిల్లాలలో సరాసరి 15.9 మిల్లీమీటర్ల వర్షం

- కార్మిక వాడల్లో ఇళ్లలోకి నీళ్లు  - కలెక్టరేట్‌లో కంట్రోల్‌ ఏర్పాటు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వర్షాలు అగడం లేదు. గత ఇరవైరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనం ఉక్కిరిబిక్కిరి అవు తున్నారు. అల్పపీడన ప్రభావంతో అదివారం రాత్రి నుంచి సోమవారం కూడా వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది.  ఉదయం వరకు జిల్లాలో సరాసరి 15.9 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. మధ్యాహ్నం వేళల్లో కురిసిన భారీ వర్షానికి సిరి సిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక వాడలు జలమయం అయ్యా యి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 38.8 మిల్లీమీటర్ల వర్షం నమో దు కాగా కోనరావుపేటలో 25.0 మిల్లీమీటర్లు, వేములవాడలో 11.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వీర్నపల్లిలో 39.5 మిల్లీమీటర్లు, రుద్రంగిఒలో 33.7, గంభీరావుపేటలో 22.4, ఎల్లారెడ్డిపేటలో 15.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. భారీ వర్షానికి వరి పోలాలు, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. సిరి సిల్లలోని చేనేత చౌక్‌, శాంతినగర్‌, సర్ధార్‌నగర్‌, గణేష్‌నగర్‌, సిద్ధార్థనగర్‌, మెహెర్‌నగర్‌, ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోని నీళ్లు చేరా యి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురవడంతో అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఎల్లారెడ్డిపేట మండలంలో కుండపోత వానకు మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల శివారుల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి.  గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వంతెన మళ్లీ నీట మునిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ మానేరు ప్రాజెక్టు ఉప్పొంగడంతో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.  

 లోతట్టు ప్రాంత కుటుంబాల తరలింపు 

 జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల కుటుంబాలను పున రావాస కేంద్రంగా ఏర్పాటు చేసిన నర్సింగ్‌ కళాశాలలోకి తరలించారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని శాంతినగర్‌, ఆటోనగర్‌, సిద్ధార్థనగర్‌, అంబేద్కర్‌నగర్‌, సర్ధార్‌నగర్‌, వెంకంపేట ప్రాంతాల్లోకి భారీ వరద నీరు చేరింది.  ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, మున్సి పల్‌ కమిషనర్‌ సమ్మయ్య, సీఐ అనిల్‌కుమార్‌, కౌన్సిలర్ల సహ కారంతో 30 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తర లించారు.   కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా రెవెన్యూ, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.   ఫిర్యాదులు తెలపడానికి కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు.   9398684240 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు. 

100కు కాల్‌ చేయాలి 

సిరిసిల్ల క్రైం: భారీ వర్షాలకు ఏదైనా జరిగితే డయల్‌ 100కు కాల్‌చేస్తే, తక్షణ చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. పోలీసు యం త్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. రహదారులు, కల్వ ర్టులు తెగిపోయే పరిస్థితి ఉంటే బారికేడ్లు, ప్లాస్టిక్‌ కోన్స్‌, త్రెడ్‌ వంటి పరికరాలను అమర్చాలని, ట్రాఫిక్‌ డైవర్షన్‌ చే యాలని అన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలన్నారు.  

  అప్రమత్తంగా ఉండాలి

వేములవాడ : భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు సూచించారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానిక బుడిగె జంగాల కాలనీలో సోమవారం పర్యటించారు. సురక్షిత ప్రాంతాలకు ముందుగానే తరలివెళ్లాలని, అవసరమైన వారికి వసతి, భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, వైస్‌ చైర్మన్‌ మధు రాజేందర్‌, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, నిమ్మశెటి ్ట విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.