మురిపించి.. ముఖం చాటేసి..

ABN , First Publish Date - 2021-06-23T05:08:03+05:30 IST

ఈ నెలారంభంలో పడిన భారీ వర్షాలతో రైతన్నల్లో సాగు ఆశలు రెట్టింపయ్యాయి. తొలకరితోనే వాతావరణం ఆశాజనకంగా కనిపించడంతో అన్నదాతలు మెట్ట పైర్లకు ముమ్మరంగా సాగారు.

మురిపించి.. ముఖం చాటేసి..
పత్తి విత్తనాలు వేస్తున్న దృశ్యం

మారిన వాతావరణంతో అన్నదాతల్లో ఆందోళన

ఖమ్మం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఈ నెలారంభంలో పడిన భారీ వర్షాలతో రైతన్నల్లో సాగు ఆశలు రెట్టింపయ్యాయి. తొలకరితోనే వాతావరణం ఆశాజనకంగా కనిపించడంతో అన్నదాతలు మెట్ట పైర్లకు ముమ్మరంగా సాగారు. ఖమ్మం జిల్లాలో పదిరోజుల నుంచే పత్తి విత్తనాలు వేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తొలుత వేసిన విత్తనాలు మొలకెత్తుతుండటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇంకా కొన్నిచోట్ల విత్తనాలు పెడుతుండగా.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా వర్షం లేకపోవడంతో మొలకెత్తిన పత్తి ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వరుణుడిపై భారం వేసిన అన్నదాతలు ఆకాశంవైపు చూస్తున్నారు. కొన్ని చోట్ల బావులు, వాగుల నుంచి నీటిని తడులు అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 2,70,000ఎకరాల్లో పత్తి సాగు అంచనా కాగా.. ఇప్పటికే 25వేల ఎకరాల్లో పంట వేశారు. జిల్లా సగటు వర్షపాతం జూన్‌లో 105.2మి.మీకాగా 111.6మి.మీ.వరకు వర్షం కురిసింది. కొన్నిచోట్ల కంది,పెసర లాంటి పంటలు కూడా వేశారు. 

Updated Date - 2021-06-23T05:08:03+05:30 IST