Advertisement
Advertisement
Abn logo
Advertisement

తరుముతున్న వాన..

వ్యవసాయ పనుల్లో అన్నదాత బిజీబిజీ


వీరవాసరం/ఆచంట, నవంబరు 30 : వాతావరణ మార్పు నిత్యం రైతును భయపెడుతూనే ఉంది. వాయుగుండం ఏర్పడ డంతో గత రెండో రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అయినా రైతులు వరి మాసూళ్ళు చేసేందుకు  ముందడుగు వేస్తున్నారు. మళ్లీ వాతావరణం ఎలా ఉంటుందో ననే ఆందోళనలో మాసూళ్ళకు ఉపక్రమిస్తు న్నారు. భారీ వర్షాల వల్ల నేలకు ఒరిగిన చేలల్లో కూలీలతో.. యంత్రాలతోనూ వరికోతలు ప్రారంభించారు. గత రెండు రోజులుగా రైతులు మాసూళును వేగవంతం చేశారు.వాతావరణం కూడా నిరంతరం మబ్బులు, మేఘాలతో ఉండటంతో చేతికొచ్చిన పంటను తొందరగానే మాసూళ్లు చేయడం మంచిదని రైతులు ఆలోచించి మాసూళ్లు చేయడానికి రైతులు కంగారుపడుతున్నారు. దీంతో మండలంలో ఒక్కసారిగా వ్యవసాయ కూలీలకు గిరాకి ఏర్పడింది.మరో పది, పదిహేను రోజులు వాతావరణం అనుకూలిస్తే సార్వా పంట  గట్టెక్కుతామని పలువురు రైతులు అంటున్నారు.


Advertisement
Advertisement