కోతకొచ్చిన పైరును పొట్టన పెట్టుకుంది!

ABN , First Publish Date - 2021-01-10T04:29:57+05:30 IST

: పండుగకు ఇంటికి వస్తుందనుకున్న ధాన్యం వర్షం కారణంగా పొలంలోనే మొలకెత్తడంతో రైతులు విలవిలలాడుతున్నారు.

కోతకొచ్చిన పైరును పొట్టన పెట్టుకుంది!
నేలవారిన వరిపైరును చూసుకుంటున్న రైతన్న

 వర్షంతో రైతుల విలవిల 

 మొలకెత్తిన వెన్నులతో అధికారులకు మొర 

సూళ్లూరుపేట, జనవరి 9 : పండుగకు ఇంటికి వస్తుందనుకున్న ధాన్యం వర్షం కారణంగా పొలంలోనే మొలకెత్తడంతో రైతులు విలవిలలాడుతున్నారు. నీళ్లల్లో నానుతున్న వరిపైరును చూసి కంటతడిపెడుతున్నారు. నాలుగు రోజులుగా కురిసిన వర్షం మండలంలో రైతులలను నష్టాలపాలు చేసింది. సూళ్లూరుపేట మండలంలో 12,500 ఎకరాల్లో వరి సాగుచేయగా,  1500 ఎకరాల్లో    మూడు రోజుల్లో కోయాల్సిఉంది. హఠాత్తుగా వర్షం కురవడంతో ఈ పైరు నేలవాలి పనికిరాకుండా పోయిందని రైతులు లబోదిబోమంటున్నారు. మంగళంపాడు, దామానెల్లూరు, ఉగ్గుమూడి, సుగ్గుపల్లి, మంగానెల్లూరు తదితర గ్రామాల్లో వరిపైరు ఇప్పటికీ నీళ్లలోనే ఉంది

 అధికారులకు మొర 

చేతికి వస్తుందనుకున్న పంట చేజారిపోవడంపై రైతులు శనివారం సూళ్లూరుపేట తహసీల్దారు కార్యాలయంలో తమ బాధను ఏకరువుపెట్టారు. మొలకెత్తిన వెన్నులను తీసుకువచ్చి తహసీల్దారు రవికుమార్‌కు చూపి తమను ఆదుకోవాలని విన్నవించారు. 



Updated Date - 2021-01-10T04:29:57+05:30 IST