Abn logo
May 7 2021 @ 17:56PM

‘చదువుకో.. చాక్లెట్లు తీసుకోకు’.. వైరల్ అవుతున్న రైనా-కర్రాన్ మీమ్స్

క్రికెట్ మన దేశంలో ఎంత పాపులరో వేరే చెప్పక్కర్లేదు. క్రికెటర్లపై ఫ్యాన్స్ అభిమానం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇక ఒక్కసారి ఓ క్రికెటర్‌ను అభిమానించడం మొదలు పెట్టారంటే అతడు విదేశీయుడైనా అతడిని సొంత మనిషిలా ప్రేమిస్తారు. ఆ అభిమానంతోనే కొన్నిసార్లు వారిపై స్వీట్ జోకులు పేలుస్తుంటారు. సరదా మీమ్‌లు సృష్టించి నవ్వులు పూయిస్తుంటారు. తాజాజా చెన్నై సూపర్ కింగ్స్ పేసర్, ఇంగ్లండ్ ఆటగాడు శామ్ కర్రాన్‌పై కూడా భారత క్రికెట్ అభిమానులు ఇలాంటి జోక్స్, మీమ్‌లతో తెగ హల్ చేశారు. అందులో రైనా-శామ్‌లకు సంబంధించిన ఓ మీమ్ అయితే ట్విటర్లో విపరీతంగా ట్రెండ్ అయింది.

ఆ మీమ్‌లో శామ్ కర్రాన్ దిగాలుగా కూర్చుని ఉంటే రైనా అతడి చేతిని పట్టుకుని ఏదో ఓదారుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోను షేర్ చేసిన నెటిజన్లు.. శామ్‌‌కు రైనా జాగ్రత్తలు చెబుతున్నట్లు క్రియేట్ చేశారు. ‘ఇంటికెళ్లి చదువుకో.. ఎవరైనా అపరిచితులు చాక్లెట్ ఇస్తే తీసుకోకు’ అంటూ శామ్ కర్రాన్‌తో సురేశ్ అంటున్నట్లు ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో చూసిన శామ్ కూడా నవ్వేశాడు. ఇక రైనా సైతం స్మైలీ ఎమోజీని పోస్ట్ చేశాడు.

ఇదిలా ఉంటే ఐపీఎల్ 14వ సీజన్ ఇటీవలే వాయిదా పడిన విషయం తెలిసిందే. బయోబబుల్ వాతావరణంలో టోర్నీ జరుగుతున్నప్పటికీ.. ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నీని అర్థాంతరంగా నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. దీంతో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే శామ్‌పై ఈ మీమ్స్ వైరల్ అయ్యాయి.

అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ జట్టలో అందరికంటే చిన్నవాడు శామ్ కావడం, అతడి క్లీన్ షేవ్, నీట్ క్రాఫ్ లుక్స్ కూడా అతడిని మరింత చిన్నవాడిగా చూపిస్తాయి. దీంతో అతడి గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ షేర్ చేస్తున్నారు.


Advertisement