వర్షాలకు దెబ్బతిన్న ముంబై - చెన్నై జాతీయ రహదారి

ABN , First Publish Date - 2021-11-28T05:48:56+05:30 IST

భారీవర్షాలకు ములకలచెరువు మీదుగా వెళ్తున్న ముంబై - చెన్నై జాతీయ రహదారి దెబ్బతింది. ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు పలు చోట్ల గుంతలమయమైంది.

వర్షాలకు దెబ్బతిన్న ముంబై - చెన్నై జాతీయ రహదారి
బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్‌ వద్ద ....

సాహసంగా మారిన ప్రయాణం


అవస్థలు పడుతున్న వాహనదారులు


ములకలచెరువు, నవంబర్‌ 27: భారీవర్షాలకు ములకలచెరువు మీదుగా వెళ్తున్న ముంబై - చెన్నై జాతీయ రహదారి దెబ్బతింది. ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు పలు చోట్ల గుంతలమయమైంది. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు హడలెత్తిపోతున్నారు.  ములకలచెరువు, బి.కొత్తకోట, కురబలకోట మండలం అంగళ్ళు మీదుగా మదనపల్లెకు వెళ్లే జాతీయ రహదారిపై పలు చోట్ల దుస్థితికి చేరింది. ములకలచెరువు, పెద్దపాళ్యం, బురకాయలకోట, బి.కొత్తకోట మండలం గోళ్లపల్లె, కాండ్లమడుగు క్రాస్‌, అంగళ్లు సమీపాల్లో కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి.  ఇక బి.కొత్తకోట మండలంలోని గోళ్లపల్లె, కాండ్లమడుగు క్రాస్‌ వద్ద గుంతలు చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ రాకపోకలు సాగించాలంటే వాహనదారులు సర్కస్‌ ఫీట్లు చేయాల్సి వస్తోంది. అలాగే ఈ పెద్దపాటి గుంతలలో కార్లు, ఆటోలు రాకపోకలు సాగించలేక ఇంజన్లు కింద తగిలి నిలిచిపోతున్నాయి. వీటితో పాటు భారీ లగేజీతో వెళ్లే లారీలు సైతం గుంతల్లో మొరాయిస్తున్నాయి. వాహనాలు గుంతలలో నిలిచిపోతుండడంతో  రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సంబంధిత అధికారులు స్పందించి జాతీయ రహదారికి మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.







Updated Date - 2021-11-28T05:48:56+05:30 IST