కేరళలో వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2021-10-17T08:56:34+05:30 IST

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి కు రుస్తున్న వర్షానికి రాష్ట్రంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కేరళలో వర్ష బీభత్సం

తిరువనంతపురం, అక్టోబరు16: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి కు రుస్తున్న వర్షానికి రాష్ట్రంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నా యి. ప్రధానంగా దక్షిణ, మధ్య కేరళలోని జిల్లాలపై వర్షం ప్ర భావం తీవ్రంగా ఉంది. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లోని పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మృతి చెందారు. 16 మంది గల్లంతయ్యారు. పథనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్‌, పాలక్కాడ్‌ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 

Updated Date - 2021-10-17T08:56:34+05:30 IST