జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

ABN , First Publish Date - 2021-06-13T04:25:01+05:30 IST

జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని వారం జిల్లాలో 24.4మి.మీ. వర్షపాతం నమోదు అయింది.

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు
కుశ్నపల్లి-సుస్మీర్‌ గ్రామాల మధ్య లోలెవల్‌ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు

- తొలకరి పలుకరింపుతో పనుల్లో నిమగ్నమైన రైతులు

- జిల్లాలో 24.4మి.మీ. వర్షాపాతం నమోదు

ఆసిఫాబాద్‌, జూన్‌ 12: జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని వారం జిల్లాలో 24.4మి.మీ. వర్షపాతం నమోదు అయింది. తొలకరి పలుకరింపుతో రైతులు ఖరీఫ్‌ పనుల్లో నిమగ్నమయ్యారు. కొన్నిచోట్లరైతులు విత్త నాలను విత్తేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు గాను గతంలోనే వ్యవసాయ భూములను చదును చేసి వానాకాలం సాగుకు సన్నద్ధమయ్యారు. జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ఆసిఫాబాద్‌ మండలం పెద్దవాగు నది ఉధృతంగా ప్రవహించ డంతో గుండి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది.

పడిపోయిన 33/11 కేవీ లైన్‌..

సిర్పూర్‌(టి): మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీవర్షానికి లోనవెల్లి గ్రామానికి వెళ్లే 33/11 కేవీ విద్యుత్‌ లైన్‌ స్తంభం లక్ష్మిపూర్‌వాగులో పడిపోయింది. దీంతో మండలంలోని 16గ్రామ పంచాయతీల్లో రాత్రినుంచి విద్యుత్‌సరఫరా నిలిచి పోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ ఏఈ ఇర్ఫాన్‌ అహ్మద్‌ తక్షణమే స్పందించి వాగు వద్దకువెళ్లి విద్యుత్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. 

బెజ్జూరులో ..

బెజ్జూరు: మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. వారంరోజులుగా ఎండల తీవ్రత పెర గగా శనివారం కురిసిన వర్షంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. కురిసిన భారీవర్షానికి కుశ్న పల్లి, సుస్మీర్‌ గ్రామాల మధ్య ఒర్రెలు ఉప్పొం గడంతో వాగుఅవతల గ్రామాలకు రాకపోకలు నిలి చిపోయాయి. వాగు ఉధృతితగ్గేవరకుప్రయాణికులు వాగువద్దే వేచిచూడాల్సినపరిస్థితులు నెలకొన్నాయి.

జిల్లాలో 24.4 మి.మీ. వర్షపాతం నమోదు

జిల్లాలో శనివారం 24.4మి.మీ. వర్షపాతం నమో దయింది. జైనూరులో 18.2మి.మీ., సిర్పూర్‌ (యూ) లో 21.6మి.మీ., తిర్యాణిలో 16.2 మి.మీ., రెబ్బెనలో 16.0మి.మీ., ఆసిఫాబాద్‌లో 20.2 మి.మీ., కెరమెరిలో 17.2 మి.మీ., వాంకిడిలో 37.4 మి.మీ., కాగజ్‌నగర్‌లో 22.8 మి.మీ., సిర్పూర్‌(టి)లో 55.4మి.మీ., కౌటాలలో 23.6 మి.మీ., బెజ్జూరులో 20.2 మి.మీ., దహెగాంలో 23.4మి.మీ.ల వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్‌(టి)లో 55.4మి.మీ., అత్యల్పంగా రెబ్బెనలో 16.0మి.మీ.వర్షపాతం నమోదు అయింది.

Updated Date - 2021-06-13T04:25:01+05:30 IST