HYDERABAD: గంటపాటు భారీ వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్

ABN , First Publish Date - 2021-07-18T23:27:56+05:30 IST

HYDERABAD: గంటపాటు భారీ వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్

HYDERABAD: గంటపాటు భారీ వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. గంటపాటు భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. రాయదుర్గం నుంచి మెహదీపట్నం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి షేక్ పెట్ ఫ్లైఓవర్ కింద వరద నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2021-07-18T23:27:56+05:30 IST