తెలంగాణలో విస్తారంగా వర్షాలు..వందలాది ఎకరాల్లో పంట నీటమునక

ABN , First Publish Date - 2021-08-30T23:02:16+05:30 IST

తెలంగాణలో విస్తారంగా వర్షాలు..వందలాది ఎకరాల్లో పంట నీటమునక

తెలంగాణలో విస్తారంగా వర్షాలు..వందలాది ఎకరాల్లో పంట నీటమునక

రాజన్న సిరిసిల్ల: వేములవాడలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజన్న ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. మరోవైపు డ్రైనేజీ ఉప్పొంగడంతో దుకాణాల్లోకి నీరు చేరింది. రోడ్లపై ప్రవహించిన వర్షపు నీటితో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. 


ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోని కొహెడ, అక్కన్నపేట, ఉస్నాబాద్ మండలాల్లో భారీ వర్షానికి వాగులు ఉప్పొంగుతున్నాయి. గౌరవెళ్లి పాత చెరువు తెగడంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. 



Updated Date - 2021-08-30T23:02:16+05:30 IST