Abn logo
Oct 22 2021 @ 23:56PM

బాలల హక్కులపై అవగాహన పెంపొందించాలి

కార్యక్రమంలో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధిని

- సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధిని

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 22 : బాలలు తమ కున్న హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి డీ వరూధిని తెలిపారు. శుక్ర వారం ఆజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా నాల్సా ఉత్సవాలను జిల్లా కేంద్రంలోని జడ్పీ పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌ జడ్జి డీ వరూధిని మాట్లాడుతూ అక్టోబరు 2 నుంచి నవంబర్‌ 14 వరకు నాల్సా ఆదేశాలతో అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేదవర్గాలకు న్యాయం అందించే దిశగా మన రాజ్యాం గంలో ఆర్టికల్‌ 39ఏ సవరణ చేపట్టారు. అనంతరం జాతీయ లీగల్‌ సర్వీస్‌ ఆథారిటీ చట్టాన్ని రూపొందిం చారని తెలిపారు. ఈ చట్టం ప్రకారం పేద, బడుగు, బలహీన వర్గా లకు సైతం ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా న్యాయం అం దేలా కృషి చేస్తుందని తెలిపారు. జాతీయ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రజల వద్దకు న్యాయవ్యవస్థ తీసుకువెళ్లే దిశగా అక్టోబరు 2 నుంచి నవం బర్‌ 14 వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. దేశంలో 40 కోట్ల మంది బాలబాలికల జనాభా ఉందని, వీరిలో కొం దరి స్థితిగతులు సరిగ్గా లేవని తెలిపారు. ఐక్యరాజ్యసమితి 1989లో పిల్లల హక్కుల సంరక్షణ దిశగా చర్యలు చేపట్టిందన్నారు. వీటిలో ముఖ్యంగా పిల్లలకు 4 హక్కులు ఉన్నాయని, జీవనం, అభివృద్ధి, విద్య, భద్రత వంటి హక్కులు ఉన్నాయని తెలిపారు. దేశంలో ఉన్న ప్రతి పిల్లలకు ఈ హక్కులు ఉన్నాయని, వీటిని అమలుచేయడం అందరి బాధ్యత అని తెలిపారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షు డు డీవీ రమాణారెడ్డి, సెక్రెటరి ఎల్‌ భాస్కర్‌, ప్యానల్‌ లాయర్‌, అడ్వకేట్‌లు హనుమాన్‌సింగ్‌, శ్రీధర్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశా ల ప్రధానోపాధ్యాయులు మురళినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.