Abn logo
Sep 25 2021 @ 23:27PM

పౌష్టికాహరంపై అవగాహన కల్పించాలి

మల్యాలలో సామూహిక సీమంతం

ఐసీడీఎస్‌ పీడీ నరేశ్‌

మల్యాల, సెప్టెంబరు 25: పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమౌతుందని, పౌష్టికాహారంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి అందించాలని పీడీ నరేశ్‌ సూచించారు. పోషణమాసంలో భాగంగా మల్యాలలో శనివారం గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారు లకు అన్నప్రాసన, అక్షర భ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహరం అం దించాలంటూ దాని ప్రాముఖ్యతను వివరించారు. అంగన్‌వాడీల సేవ లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల పౌష్టికాహరం అందించారు. ఎంపీపీ మిట్టపెల్లి విమల, మల్యాల ప్రాజెక్ట్‌ సీడీపీవో నర్సింగరాణీ సర్పంచ్‌ మిట్టపెల్లి సుదర్శన్‌ పాల్గొనగా సర్పంచ్‌ 15మం దికి చీరలు ఇతరాత్ర అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైల జారాణీ, సూపర్‌వైజరు రాజశ్రీ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు