Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీఎస్‌పై మరింత అవగాహన కలిగించండి


 డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ 

నరసన్నపేట, నవంబరు 29: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పొందేందుకు ఓటీఎస్‌ విధానంతో ప్రయోజనాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగించాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఓటీఎస్‌పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ నక్క గణపతిరావు,  ఎంపీడీవో రవి కుమార్‌, తహసీల్దార్‌ కె.ప్రవల్లిక ప్రియ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


ప్రాజెక్టులు పూర్తికి చర్యలు తీసుకోండి

ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ  సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఆదేశించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడు డోల తిరుమలరావు సంఘ ప్రతినిధులతో డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. కార్యక్రమంలో సంఘం అసోసియేట్‌ అధ్యక్షుడు జి.రామచంద్ర, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.మురళీ మోహన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.శ్రీకాంత్‌, ఉపాధ్యక్షుడు బి.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement